కివీ ఫ్రూట్: ఈ పండు మధుమేహ రోగులకు వరం

కివీ ఫ్రూట్: ఈ పండు మధుమేహ రోగులకు వరం

కివీ పండు.. పోషక విలువలు బాగున్నాయి

మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

కివీ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. సీజన్ మారుతున్న సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పండ్ల వినియోగం చాలా ముఖ్యం. మార్కెట్‌లో లభించే పండ్లలో కివీ ఒకటి. ఇందులో విటమిన్ సి మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది గుండె పనితీరుతో పాటు జీర్ణవ్యవస్థ మరియు రోగనిరోధక వ్యవస్థకు ఒక వరంలా పనిచేస్తుంది. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ సాధారణ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. యాంటీఆక్సిడెంట్ విటమిన్లు కంటి వ్యాధులను నివారించడమే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తాయి.

కివి ఒక రుచికరమైన పండు. ఇతర పండ్ల మాదిరిగానే ఇందులోనూ సహజ చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజుకు 140 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఈ పండ్లలో యాంటీ హైపర్‌టెన్సివ్ గుణాలు ఉన్నాయి. ఇది బీపీని నియంత్రించడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పండ్లు సహాయపడతాయి. వీటిలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మరియు ఇతర జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్ మరియు అజీర్ణంతో పోరాడుతుంది. ఆస్తమా నివారణలో మేలు చేస్తుంది. ఇది వాపు మరియు దాని వల్ల కలిగే వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

కివీతో ప్రయోజనాలు ఎక్కువ..

కివిలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఎలాంటి భేదం లేకుండా అందరూ వీటిని తినవచ్చు. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి పోషకాలు అందుతాయి. ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్ సి వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కివి అంటే ఖనిజాల గని అని అర్థం. సీజన్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కివీని తప్పనిసరిగా తినాలి.

– డాక్టర్ మహేందర్, పిల్లల ఆసుపత్రి

హైదరాబాద్ , షాపూర్ నగర్ , జూన్ 15 (ఆంధ్రజ్యోతి)

నవీకరించబడిన తేదీ – 2023-06-16T12:52:01+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *