ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో రూట్ చేసిన 29 పరుగులతో సచిన్ వ్యక్తిగత 10 పరుగుల రికార్డును అధిగమించాడు.

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో రూట్ చేసిన 29 పరుగులతో సచిన్ వ్యక్తిగత 10 పరుగుల రికార్డును అధిగమించాడు. భారత్, ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 2,535 పరుగుల రికార్డును రూట్ అధిగమించాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 2,555 పరుగులు ఉన్నాయి. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ రికార్డును కూడా రూట్ సమం చేశాడు. టెస్టు క్రికెట్లో టీమ్ ఇండియాపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాంటింగ్‌తో జతకట్టాడు. పాంటింగ్ కూడా టెస్ట్ క్రికెట్లో టీమ్ ఇండియాపై 2,555 పరుగులు చేశాడు. కానీ పాంటింగ్ 51 ఇన్నింగ్స్‌లు ఆడగా, రూట్ 47 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు.
ప్రస్తుతం వీరిద్దరూ సమంగా ఉన్నప్పటికీ మరో పరుగు సాధిస్తే టీమిండియాపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇదే టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో రూట్ ఈ రికార్డును చేరుకునే అవకాశం ఉంది. ఇక ఇదే మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ జోడీ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు సృష్టించారు. వీరిద్దరూ కలిసి అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో టీమిండియా తరఫున 500 వికెట్లు పూర్తి చేశారు. దీంతో టీమిండియా తరఫున 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలింగ్ జోడీగా అశ్విన్, జడేజా చరిత్ర సృష్టించారు. అలాగే 501 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే-హర్బజన్ సింగ్ రికార్డును బద్దలు కొట్టారు. దీంతో 503 వికెట్లతో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలింగ్ జోడీగా అశ్విన్-జడేజా చరిత్ర సృష్టించారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో బెన్ డకెట్, ఆలీ పోప్, జాక్ క్రాలీ, జో రూట్లను అవుట్ చేయడం ద్వారా అశ్విన్-జడేజా జోడీ ఈ రికార్డు నెలకొల్పింది.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – జనవరి 25, 2024 | 02:12 PM