ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ స్మార్ట్’. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ ద్వారా నిర్మించబడింది. ఇటీవలే ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఎనర్జిటిక్ హీరో రామ్ (రామ్ పోతినేని). వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ ద్వారా నిర్మించబడింది. ఇటీవలే ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంజయ్ దత్ శనివారం సెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థతో పాటు సంజయ్ దత్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సంజయ్ దత్ బిగ్ బుల్ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. సిగార్ తాగుతూ, ఫంకీ హెయిర్‌స్టైల్‌తో, చేతులకు ఉంగరాలు, వేళ్ల మధ్య టాటూలు వేసుకుని సంజయ్ స్పోర్టీగా కనిపిస్తున్నాడు. (BigBull)
పూరిలాంటి మాస్ డైరెక్టర్ ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, సైంటిఫిక్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బిగ్‌బుల్‌గా నటిస్తున్నాను అని ట్విట్టర్‌లో తెలిపారు. ప్రస్తుతం రామ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. స్టంట్ డైరెక్టర్ కెచ్చ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే వారం ఈ యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుందని సమాచారం. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
నవీకరించబడిన తేదీ – 2023-07-29T10:08:11+05:30 IST