సామాన్యులకు రక్షణ కల్పించేందుకు.. ఏ ఆపద వచ్చినా వారిని ఆదుకునేందుకు.. వారిని సమస్యల నుంచి గట్టెక్కించి న్యాయం చేసేందుకు పోలీసులు ఉన్నారు! కానీ.. కొందరు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్యాయాలకు పాల్పడుతున్నారు. సాయం కోసం వచ్చిన బాధితులను వేధిస్తున్నారు. తాజాగా తమిళనాడులో కూడా ఓ అధికారి నరమాంస భక్షకుడిగా ప్రవర్తించాడు.

సామాన్యులకు రక్షణ కల్పించేందుకు.. ఏ ఆపద వచ్చినా వారిని ఆదుకునేందుకు.. వారిని సమస్యల నుంచి గట్టెక్కించి న్యాయం చేసేందుకు పోలీసులు ఉన్నారు! కానీ.. కొందరు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్యాయాలకు పాల్పడుతున్నారు. సాయం కోసం వచ్చిన బాధితులను వేధిస్తున్నారు. తాజాగా తమిళనాడులో కూడా ఓ అధికారి నరమాంస భక్షకుడిగా ప్రవర్తించాడు. పోగొట్టుకున్న స్కూటర్‌ను కనిపెట్టమని అడిగితే బురఖా తీసేయమని ఓ ముస్లిం మహిళను హెడ్ కానిస్టేబుల్ వేధించాడు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఫిబ్రవరి 14న ఫాతిమా అనే మహిళ తన స్కూటర్ తప్పిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే, ఫిర్యాదు చేసినా కేసులో పురోగతి లేకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. ఫిబ్రవరి 16న ఏదో పని నిమిత్తం పుదుపేటకు వెళ్లగా.. స్కూటర్ కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అందించిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి స్కూటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇంకేముంది..ఫాతిమా తన స్కూటర్ తెచ్చుకోవడానికి చాలా సంతోషంగా స్టేషన్‌కి వెళ్లింది. అయితే స్కూటర్‌ను కోర్టు నుంచి విడుదల చేయాల్సి ఉంటుందని హెడ్‌కానిస్టేబుల్ వేల్మురుగన్ ఆమెకు చెప్పాడు. కోర్టుకు వెళ్లేందుకు సంకోచించిన మహిళ ఒక్కసారిగా ఏడ్వడం ప్రారంభించింది. తనకు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయని ఆమె వాపోయింది. తాను ఈ స్కూటీపైనే ఆధారపడి ఉన్నానని కానిస్టేబుల్‌తో చెప్పి ఎలాగైనా స్కూటీ ఇవ్వాలని కానిస్టేబుల్‌ను కోరింది.
కానీ.. వేల్మురుగన్ అందుకు అంగీకరించలేదు. దొంగతనం కేసు నమోదు చేసినందున కోర్టును ఆశ్రయించక తప్పదన్నారు. దీంతో ఆమె మరింత బాధపడింది. ఆ సమయంలో రక్షకుడిగా ఆమెను ఓదార్చాల్సి ఉండగా.. హెడ్ కానిస్టేబుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఏడ్చినా అందంగా ఉన్నావు అన్నాడు. బురఖా తీయండి, అది మీ ముఖాన్ని దాచిపెడుతుంది, అన్నాడు. అతడి వ్యాఖ్యలతో మరింత మనస్తాపానికి గురైన ఫాతిమా.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ తీరుపై ఆమె కుటుంబ సభ్యులు పులియంతోప్ అసిస్టెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేశారు.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 24, 2024 | 08:56 PM