శాఖల వారీగా షెడ్యూల్ ఖరారైంది
హైదరాబాద్‌లోనే ‘టెక్నికల్’ నిర్వహణ
త్వరలో హాల్‌టికెట్ జారీపై ప్రకటన
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడి
హైదరాబాద్ , జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో (తెలంగాణ) ఎస్‌ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి వ్రాత పరీక్ష షెడ్యూల్ ఖరారైంది. మార్చి 12 నుంచి రాత పరీక్షలు ప్రారంభమవుతాయని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆదివారం ప్రకటించింది.అందు ప్రకారం మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు సివిల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, ఫింగర్‌ప్రింట్ విభాగాలకు వేర్వేరుగా ఫైనల్ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఐటీ, కమ్యూనికేషన్ ఎస్సీ అభ్యర్థులకు మార్చి 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వేలిముద్ర సీఎస్‌ఐ అభ్యర్థులకు సాంకేతిక పరీక్ష ఉంటుంది. అలాగే మార్చి 26న ఉదయం ట్రాన్స్‌పోర్ట్ సీఎస్‌ఐ అభ్యర్థులకు, ఏప్రిల్ 2న కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు టెక్నికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. కానిస్టేబుల్ మెకానిక్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష ఏప్రిల్ 2 మధ్యాహ్నం సెషన్‌లో జరుగుతుంది. ఈ పరీక్షలన్నీ హైదరాబాద్ కేంద్రంగా జరగనున్నాయి.
ఎస్‌ఎస్‌ఐ రాత పరీక్షలో నాలుగు పేపర్లు ఉండగా, సివిల్, ఐటీ, ట్రాన్స్‌పోర్ట్ ఎస్‌ఎస్‌ఐ, ఫింగర్ ప్రింట్ విభాగం ఏఎస్‌ఐ అభ్యర్థులకు ఏప్రిల్ 8న మొదటి రెండు పేపర్లు నిర్వహించనున్నారు. ఉదయం సెషన్‌లో అర్థమెటిక్, రీజనింగ్, మధ్యాహ్నం ఇంగ్లిష్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 9న సివిల్ ఎస్సీ అభ్యర్థులకు ఉదయం మూడో పేపర్ జనరల్ స్టడీస్, మధ్యాహ్నం తెలుగు లేదా ఉర్దూ పరీక్షలు ఉంటాయి. ఎస్‌ఎస్‌సీ ఫైనల్ పరీక్షల కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సివిల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏప్రిల్ 23 ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు. కాగా, పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. దేహదారుఢ్య పరీక్షలు జనవరి 5వ తేదీతో ముగుస్తాయని, రాత పరీక్షల హాల్‌టికెట్లపై త్వరలో ప్రకటన వెలువడుతుందని తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2023-01-02T11:13:39+05:30 IST