తెలంగాణ: ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-03-10T11:43:07+05:30 IST

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సబ్జెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 10 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను గుర్తించారు. భవిష్యత్తులో ప్రైవేట్ కళాశాలల్లో

తెలంగాణ: ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం

కీలక నిర్ణయం

జనరల్ డిగ్రీలో ఇంజనీరింగ్ కోర్సులు

ఉన్నత విద్యామండలి సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్ , మార్చి 9 (ఆంధ్రజ్యోతి): సాధారణ డిగ్రీలో ఇంజనీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సబ్జెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 10 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను గుర్తించారు. భవిష్యత్తులో ప్రైవేట్ కాలేజీల్లోనూ కోర్సులకు అనుమతి ఇవ్వనున్నారు. రాష్ట్రంలో (తెలంగాణ) ఉన్నత విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే అంశంపై చర్చించేందుకు గురువారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, వివిధ యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. ఈ మేరకు డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ముందుగా గుర్తించిన 10 ప్రభుత్వ కళాశాలల్లో ఈ సబ్జెక్టులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆయా కాలేజీల్లో ప్రమాణాలు పెరిగేలా న్యాక్ గుర్తింపు వచ్చేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. న్యాక్ గుర్తింపు పొందేందుకు ఆయా కళాశాలలు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. రూ.లక్ష ప్రోత్సాహకం ఇవ్వాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే కళాశాలల గుర్తింపు ప్రక్రియను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

నవీకరించబడిన తేదీ – 2023-03-10T11:43:07+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *