ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు.. ఖాళీలు ఏంటి..!

ఇండియన్ నేవీ అగ్నివీర్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫైర్‌మెన్‌గా ఎంపికైన అభ్యర్థులు INS చిల్కాలో శిక్షణ పొందుతారు. అవివాహిత పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ నేవీలో అగ్నివీర్ (SSR) పోస్టులు

పోస్ట్: అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్ – SSR)

ఖాళీలు: 1,365 (పురుషులు-1,120, స్త్రీలు-273)

అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా… కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌తో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: నవంబర్ 1, 2002 – ఏప్రిల్ 31, 2005 మధ్య జన్మించి ఉండాలి. అవివాహిత పురుష మరియు స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

కనిష్ట ఎత్తు ప్రమాణాలు: పురుషులకు 157 సెం.మీ., మహిళలకు 152 సెం.మీ. ఉండాలి

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ (CBE), వ్రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (PFT) మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

శిక్షణ: అగ్నిమాపక సిబ్బందిగా ఎంపికైన అభ్యర్థులకు కోర్సు శిక్షణ ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో నవంబర్ నెలలో ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

జీతాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35,500, నాలుగో ఏడాది రూ.40 వేలు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లీషు భాషల్లో ఉంటుంది. మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులు కేటాయించారు. ఇంగ్లీష్, గణితం, సైన్స్ మరియు జనరల్ అవేర్‌నెస్ నుండి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. తప్పుగా గుర్తించిన నాలుగు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.550

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: మే 29

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ, ఫీజు చెల్లింపు: జూన్ 15

వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *