సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ మహిళలకు శుభవార్త అందించారు. ప్రభుత్వంలో పనిచేసే మహిళలకు 12 నెలల ప్రసూతి సెలవులు.

సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ మహిళలకు శుభవార్త అందించారు. ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే మహిళలకు త్వరలో 12 నెలల మెటర్నిటీ లీవ్ పీరియడ్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. గురువారం సిక్కిం రాష్ట్ర సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎస్‌ఎస్‌సిఎస్‌ఓఏ) వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. అలాగే ఒక నెల పితృత్వ సెలవులు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల సంరక్షణ, కుటుంబ సభ్యులతో గడిపేందుకు మేలు జరుగుతుందన్నారు. ఈ సెలవులకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తామని సీఎం తెలిపారు.
రాష్ట్ర పరిపాలన & సిక్కిం అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజలకు నిరంతర సేవలు అందించడంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని సీఎం తమాంగ్ కొనియాడారు. వారే రాష్ట్రానికి వెన్నెముక. సివిల్ సర్వీసెస్ అధికారుల పదోన్నతుల ప్రక్రియను క్రమబద్ధీకరించడంపై కూడా దృష్టి సారించామని, దీంతో పదోన్నతుల సంఖ్య పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఐఏఎస్, ఎస్‌సీఎస్ (సిక్కిం సివిల్ సర్వీసెస్) అధికారులను ఆయన అభినందించారు. వీరంతా కెరీర్ పరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఇదిలా ఉండగా, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం, శ్రామిక మహిళలు 6 నెలలు లేదా 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులకు అర్హులు. ఇప్పుడు సిక్కిం ప్రభుత్వం ఆ సెలవులను మరో ఆరు నెలలు పొడిగించబోతోంది. దీనితో పాటు.. ఒక నెల పితృత్వ సెలవు బోనస్. ఇది నిజంగా సిక్కిం ప్రభుత్వ ఉద్యోగులకు (మహిళలకు) కంటగింపు అనే చెప్పాలి.
నవీకరించబడిన తేదీ – 2023-07-27T17:48:44+05:30 IST