చిరు పూరి కాంబో: ఆ వార్తల్లో నిజం లేదు

చిరు పూరి కాంబో: ఆ వార్తల్లో నిజం లేదు

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-01-16T21:45:47+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా విజయ్ దుందుభి మోగిస్తున్నారు. కలెక్షన్ల పరంగా అన్ని సంక్రాంతి చిత్రాలను బీట్ చేస్తూ.. బాక్సాఫీస్ వద్ద పూనకాలు

చిరు పూరి కాంబో: ఆ వార్తల్లో నిజం లేదు

చిరంజీవి, పూరీ జగన్నాధ్

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా విజయ్ దుందుభి మోగిస్తున్నారు. కలెక్షన్ల పరంగా సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాలను బీట్ చేస్తోంది. చాలా కాలం తర్వాత మళ్లీ పాత దర్శకుడు బాబీ కొల్లి తెరపైకి తీసుకురావడంతో.. మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. రిపీట్ ఆడియన్స్ తో.. మెగా అభిమానులు చూపిస్తున్న ప్రేమతో చాలా కాలం తర్వాత థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతి విజేత వీరే అని తేలిపోయింది. ఈ సినిమా తర్వాత చిరు చేయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ ‘భోళాశంకర్’గా కనిపించనున్నారు. తమిళ చిత్రం ‘వేదాళం’కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే ‘వీరయ్య’ సక్సెస్ తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమాతో మళ్లీ వస్తే బాగుంటుందని మెగా యూనిట్ భావిస్తున్నట్లు.. తాజాగా ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చేస్తున్న ‘భోళా శంకర్’కి కాస్త గ్యాప్ ఇచ్చి ఈ స్థానంలో మరో సినిమా చేయబోతున్నారనే టాక్ మొదలైంది. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తారని, చిరు కుమార్తె సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే మెగా వర్గాల నుంచి వస్తున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనని, ప్రస్తుతం ‘వీరయ్య’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆయన ‘భోళాశంకర్’ తప్ప మరే ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘వాల్తేరు వీరయ్య’లో మెగాస్టార్ చిరంజీవితో పాటు.. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

నవీకరించబడిన తేదీ – 2023-01-16T21:45:50+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *