ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్ యూఎల్ వంటి ఇండెక్స్ దిగ్గజాల స్టాక్స్ పతనంతో వరుసగా 6 రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1.31 శాతం లేదా 900 పాయింట్లు నష్టపోయి 66,684 పాయింట్ల వద్ద ముగిసింది. వరుస లాభాల్లో 20,000 మార్కును తాకుతుందని భావించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 1.17 శాతం లేదా 234 పాయింట్ల నష్టంతో 19,745 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.304 లక్షల కోట్ల నుంచి రూ.302.1 లక్షల కోట్లకు పడిపోయింది.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో వారాంతం ముగిశాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్ యూఎల్ వంటి ఇండెక్స్ దిగ్గజాల స్టాక్స్ పతనంతో వరుసగా 6 రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1.31 శాతం లేదా 900 పాయింట్లు నష్టపోయి 66,684 పాయింట్ల వద్ద ముగిసింది. వరుస లాభాల్లో 20,000 మార్కును తాకుతుందని భావించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 1.17 శాతం లేదా 234 పాయింట్ల నష్టంతో 19,745 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.304 లక్షల కోట్ల నుంచి రూ.302.1 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో ఒక్క శుక్రవారం సెషన్ లోనే ఇన్వెస్టర్లు మొత్తం రూ.1.9 లక్షల కోట్లు నష్టపోయారు.
ఐటీ రంగ షేర్లు భారీ నష్టాల్లో ముగియడంతో జూన్ త్రైమాసిక ఫలితాలు కొంత ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్ షేర్లు క్యూ1 ఫలితాలు దెబ్బ తిన్నాయి. ఫలితాల వెల్లడికి ముందే రిలయన్స్ షేర్లు పతనం కావడం గమనార్హం. మరోవైపు ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. మరోవైపు శుక్రవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీలు వారంవారీగా 1 శాతం లాభంతో ముగియడం గమనార్హం.
నవీకరించబడిన తేదీ – 2023-07-22T10:11:52+05:30 IST