IND vs IRE : భారత్‌తో తలపడే ఐర్లాండ్ జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరు..?

IND vs IRE : భారత్‌తో తలపడే ఐర్లాండ్ జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరు..?

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ అనంతరం భారత జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో టీమిండియాతో తలపడే ఐర్లాండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

IND vs IRE : భారత్‌తో తలపడే ఐర్లాండ్ జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరు..?

ఐర్లాండ్ జట్టు

భారత్ వర్సెస్ ఐర్లాండ్: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో టీమిండియాతో తలపడే ఐర్లాండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జట్టులో మొత్తం 15 మందికి చోటు కల్పించారు. పాల్ స్టిర్లింగ్ నేతృత్వంలో ఐర్లాండ్ బరిలోకి దిగనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 18న డబ్లిన్‌లో భారత్, ఐర్లాండ్ జట్లు తొలి టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి.

స్కాట్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీ ద్వారా ఐర్లాండ్ 2024 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ టోర్నీలో ఆడిన ఆటగాళ్లతో జట్టును ప్రకటించారు. ఆల్ రౌండర్ ఫియోన్ హ్యాండ్ స్థానంలోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకున్న గారెత్ డెలానీ ఎంపికైంది.

IND vs WI : ICC షాక్.. వెస్టిండీస్ గెలిస్తే 10 శాతం జరిమానా, ఓడిన టీమిండియాకు 5 శాతం జరిమానా.. ఎందుకో తెలుసా..?

ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, రాస్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, థియో వాన్ వర్కోమ్, బెన్ వైట్, క్రైగ్ యంగ్

బుమ్రా నాయకత్వంలో భారత్..

ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రా పునరాగమనం చేయనున్నాడు. అతని నాయకత్వంలో టీమ్ ఇండియా బరిలోకి దిగనుంది. రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్‌లో మెరిసిన రింకూ సింగ్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్లు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.

RCB : కప్ విన్నింగ్ కోచ్ వచ్చాడు.. RCB స్క్రిప్ట్ మారుస్తుందా..?

భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసీద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *