బాలీవుడ్ హీరో సంజయ్ కపూర్ అక్కినేని అమలతో తన మొదటి ఫోటో షూట్ ఫోటోను పంచుకున్నారు. ఆ పోస్ట్‌పై ఆయన భార్య స్పందిస్తూ..

సంజయ్ కపూర్ తన మొదటి ఫోటోషూట్ చిత్రాన్ని అమల అక్కినేనితో పంచుకున్నారు
సంజయ్ కపూర్ – అమల అక్కినేని : అలనాటి స్టార్ హీరోయిన్ అమల అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ టు నార్త్ చాలా సినిమాల్లో నటించి స్టార్ అనిపించుకుంది. 1992లో అక్కినేని నాగార్జునని పెళ్లాడిన అమల.. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తోంది. అమల 1986లో మైథిలి యెన్నై కడలి అనే తమిళ చిత్రంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. అయితే ఈ సినిమా తర్వాత అమల బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కానుంది.
Naga Chaitanya : మత్స్యకారులతో కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన నాగ చైతన్య.. ఎందుకో తెలుసా..?
కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమాతో అమల మాత్రమే కాదు ఓ స్టార్ యాక్టర్ కూడా బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. ఆ స్టార్ బాలీవుడ్ హీరో ‘సంజయ్ కపూర్’. 1987లో వీరిద్దరితో ఓ సినిమా మొదలైంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో భాగంగా అమల, సంజయ్‌లపై ఫోటోషూట్ కూడా నిర్వహించారు. సంజయ్ కపూర్‌కి ఇది డెబ్యూ మూవీ మాత్రమే కాదు, ఈ సినిమా కోసం చేసిన మొదటి ఫోటోషూట్ కూడా. తాజాగా సంజయ్ అందుకు సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఆకాశం ధాటి వస్తావా: కొరియోగ్రాఫర్ యష్ ‘లో’ బడ్జెట్ ప్రేమ..ఆకాశం ధాటి వస్తావా టీజర్ విడుదల..
“అందమైన మరియు ప్రతిభావంతులైన అమలతో నా మొదటి ఫోటోషూట్ జరిగింది. కానీ సినిమా మధ్యలో ఆగిపోయింది” అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన సంజయ్ కపూర్ భార్య ఫన్నీ కామెంట్ చేసింది. “అప్పట్లో నా వయసు 14 ఏళ్లు” అంటూ ఫన్నీ ఎమోజీలు జోడించింది. ఇప్పుడు ఈ పోస్ట్, కామెంట్ వైరల్ అవుతుంది. సంజయ్ కపూర్.. ఈ సినిమా ఆగిపోవడంతో దాదాపు 8 ఏళ్ల క్రితం వెండితెరకు పరిచయం అయ్యాడు.1995లో ప్రేమ్ సినిమాలో హీరోయిన్ టబుతో కలిసి నటించి తన నట జీవితాన్ని ప్రారంభించాడు.