ఆగస్ట్ 9 సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. మహేష్ బాబు బర్త్ డే ట్రీట్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మహేష్ బాబు అభిమానులకు నేను ట్రీట్ ఇస్తాను అంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆగస్ట్ 9న విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

విజయ్ దేవరకొండ మరియు మహేష్ బాబు
ఆగస్ట్ 9 సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. మహేష్ బాబు బర్త్ డే ట్రీట్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మహేష్ బాబు అభిమానులకు నేను ట్రీట్ ఇస్తాను అంటున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కుషి’. ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ‘ఖుషి’ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. సెప్టెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. అంటే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ అందరికి ట్రైలర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. (కుషి ట్రైలర్ విడుదల వివరాలు)
అలాగే సెప్టెంబర్ 1న విడుదల చేస్తామని చెబుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ట్రీట్ వస్తోంది. ఎలా అంటే.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఒకరోజు ముందే తన సినిమా టైటిల్ తో థియేటర్లలోకి వచ్చేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు.. పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఇది ట్రీట్ అవ్వక తప్పదు. మొత్తానికి ఈ రౌడీ హీరో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానులను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. మరి ఆగస్ట్ 9న ట్రైలర్ ఎలా ఉంటుందో సెప్టెంబర్ 1న సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఈ సినిమా ‘కుషి’కి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన లిరికల్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హిషామ్ అబ్దుల్ వహాబ్ పాటలు రికార్డ్ వ్యూస్ సాధిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ‘కుషి’ (కుషి ట్రైలర్) ట్రైలర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 1న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
*******************************************
*******************************************
*******************************************
నవీకరించబడిన తేదీ – 2023-08-07T18:21:02+05:30 IST