ఆదివాసీలను బీజేపీ వనవాసులుగా మార్చేసింది: రాహుల్ గాంధీ

ఆదివాసీలను బీజేపీ వనవాసులుగా మార్చేసింది: రాహుల్ గాంధీ

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-08-09T17:36:18+05:30 IST

ఆదివాసీలకు బదులుగా వనవాసి అనే కొత్త పేరును బీజేపీ తీసుకొచ్చిందని, ఇది ఆదివాసీల గౌరవాన్ని కించపరచడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బుధవారం రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లా మాన్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.

ఆదివాసీలను బీజేపీ వనవాసులుగా మార్చేసింది: రాహుల్ గాంధీ

మాన్‌గర్: ఆదివాసీకి బదులు వనవాసి అనే కొత్త పేరును బీజేపీ తీసుకొచ్చిందని, ఇది ఆదివాసీల గౌరవాన్ని కించపరచడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బుధవారం రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లా మాన్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. తాను ఒకసారి తన అమ్మమ్మ (ఇందిరా గాంధీ)ని ఆదివాసీలు ఎవరని అడిగానని, వారే ఈ దేశంలోని తొలి నివాసులని ఆమె తనకు చెప్పిందని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు బీజేపీ ఆదివాసీలకు వనవాసి అనే కొత్త పేరు తీసుకొచ్చిందని, ఇది ఆదివాసీలను పూర్తిగా కించపరిచేలా ఉందన్నారు.

మిమ్మల్ని (ఆదివాసీలు) అడవుల్లో నివసించేలా చేయాలనుకుంటున్నారు.. మిమ్మల్ని వనవాసీ అంటారు.. కానీ, మీ భూములను గౌతమ్‌ అదానీకి కట్టబెడుతున్నారు.. ఇది మీ (ఆదివాసీ) దేశం. మీకు అన్ని హక్కులు ఉంటాయి’’ అని రాహుల్‌ ప్రసంగించారు. సభకు పెద్ద సంఖ్యలో ఆదివాసీలు హాజరయ్యారు. ర్యాలీలో రాహుల్ గిరిజన తరహా దుస్తులు, తలపాగా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మణిపూర్‌లో భారత మాత హత్య

ఈ సందర్భంగా మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైందని రాహుల్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని కావాలనుకుంటే రెండు మూడు రోజుల్లోనే మణిపూర్‌ మంటలను ఆర్పివేస్తానని, అయితే మణిపూర్‌ను కాలిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్ హింసపై ప్రధాని మౌనంగా ఉన్నారని విమర్శించారు. కాగా, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు.

నవీకరించబడిన తేదీ – 2023-08-09T17:42:28+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *