పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్నారు: తుషార్ గాంధీ

పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్నారు: తుషార్ గాంధీ

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-08-10T02:51:59+05:30 IST

మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతుండగా ముంబై పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు.

పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్నారు: తుషార్ గాంధీ

ముంబై, ఆగస్టు 9: మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతుండగా ముంబై పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఆయనతోపాటు స్వాతంత్య్ర సమరయోధులను కొన్ని గంటలపాటు నిర్బంధించారని పేర్కొన్నారు. “క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు క్రాంతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటి నుంచి బయలుదేరాను. నన్ను శాంతక్‌రాజ్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. బాపూజీని బ్రిటిష్ పోలీసులు కూడా ఈ చారిత్రాత్మక రోజున అరెస్టు చేశారు” అని తుషార్ గాంధీ వ్యాఖ్యానించారు. మూడు గంటల నిర్బంధం తర్వాత పోలీసులు తనను ఈవెంట్ వేదిక వద్దకు వెళ్లేందుకు అనుమతించారని తెలిపారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. తుషార్ గాంధీకి ఇచ్చిన రూట్ మ్యాప్ కాకుండా మరో మార్గంలో వెళ్లినట్లు వివరించారు. క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని 1942లో గాంధీ నేతృత్వంలో ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదాన్ (ప్రస్తుతం ఆగస్టు క్రాంతి మైదాన్)లో భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) అగ్రనేతలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేలపైనే మహాత్మాగాంధీ ‘డూ ఆర్ డై’ అని పిలుపునిచ్చారు. ఆ మైదానంలో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. మరోవైపు, ఢిల్లీలో బీజేపీని గద్దె దించాలని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శపథం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మణిపూర్ గిరిజనులను అణగదొక్కిందని విమర్శించారు. బుధవారం ఆమె కోల్‌కతాలో క్విట్ ఇండియా జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

నవీకరించబడిన తేదీ – 2023-08-10T02:51:59+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *