హైకోర్టు: మంత్రికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. అసలు విషయం…

హైకోర్టు: మంత్రికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. అసలు విషయం…

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-08-11T08:11:57+05:30 IST

రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడికి హైకోర్టు షాక్ ఇచ్చింది. మంత్రి ఆదాయానికి మించిన అవినీతి ఆరోపణలు కింద ఉన్నాయి

హైకోర్టు: మంత్రికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. అసలు విషయం...

– అక్రమాస్తుల కేసును సుమోటోగా స్వీకరించిన కోర్టు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడికి హైకోర్టు షాక్ ఇచ్చింది. మంత్రి ఆదాయానికి మించిన అవకతవకలపై కిందికోర్టు విచారణ సంతృప్తికరంగా లేదంటూ హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. అప్పీల్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేర్కొంది. 1996-2001లో డిఎంకె ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పొన్ముడి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆదాయానికి మించి రూ.1.36 కోట్లు అక్రమంగా సంపాదించాడన్న ఆరోపణలపై ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పొన్ముడి భార్య విశాలాక్షిని నిందితురాలిగా చేర్చారు. ఈ కేసు మొదట విల్లుపురం జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో, ఆ తర్వాత వేలూరు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. 172 మంది సాక్షులను విచారించారు. ఆరోపణలకు తగిన ఆధారాలు లేనందున పొన్ముడి సహా నిందితులను నిర్దోషులుగా మేజిస్ట్రేట్ వసంతశీల జూన్ 28న ప్రకటించారు. తీర్పు వెలువడి నెలలు గడుస్తున్నా ఏసీబీ అధికారులు హైకోర్టులో అప్పీలు చేసుకోలేదు. అదే సమయంలో వేలూరు కోర్టులో విచారణ సంతృప్తికరంగా లేదని భావించిన హైకోర్టు పొన్ముడి అక్రమాస్తుల కేసును సు మోటోగా స్వీకరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి ఎన్.ఆనంద్ వెంకటేష్ గురువారం ఉదయం విచారణ ప్రారంభించి సెప్టెంబర్ 7లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులు, పొన్ముడికి నోటీసులు జారీ చేశారు.

నవీకరించబడిన తేదీ – 2023-08-11T08:11:57+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *