టీమ్ ఇండియా: ప్రాక్టీస్ మ్యాచ్ లో అదుర్స్.. శ్రేయాస్ అయ్యర్ భారీ సెంచరీ

సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్‌కు ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు ఒక్క మ్యాచ్ కూడా ఆడని శ్రేయాస్‌ని ఎలా ఎంపిక చేస్తారని పలువురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆసియాకప్ కు ఎంపికైన ఆటగాళ్లు ఫిట్ నెస్ నిరూపించుకోవాలని సెలక్టర్లు సూచించారు. దీంతో బీసీసీఐ బెంగళూరులో ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహించింది. ఐదు రోజుల క్యాంపులో ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శ్రేయాస్ అయ్యర్ తన సత్తా చాటాడు. 38 ఓవర్లు బ్యాటింగ్ చేసి 199 పరుగులు చేశాడు. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్‌లోనూ పాల్గొన్నాడు.

ఇదిలా ఉంటే ఆసియా కప్‌లో టీమిండియా విజేతగా నిలవాలంటే మిడిలార్డర్ నిలకడగా రాణించాల్సి ఉంది. ఇటీవల వెస్టిండీస్, ఐర్లాండ్‌లతో జరిగిన టోర్నీలను పరిశీలిస్తే మిడిల్ ఆర్డర్ బలహీనంగా కనిపించింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞుల కొరత స్పష్టంగా కనిపించింది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ నిలకడగా రాణించకపోవడంతో మిడిల్ ఆర్డర్ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియాకప్‌కు బలమైన జట్టు అందుబాటులోకి వచ్చింది. కోహ్లి, రాహుల్, జడేజా, పాండ్యాలతో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా ఆసియా కప్‌లో ఆడనున్నారు. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ తర్వాత గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. వెన్నునొప్పితో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇప్పుడు ఫిట్ నెస్ నిరూపించుకుని ఆసియా కప్ టోర్నీకి సిద్ధమయ్యాడు.

ఇది కూడా చదవండి: ప్రపంచకప్ చెస్ ఫైనల్: టై బ్రేకర్‌లో ప్రగ్నానంద పోరాడి ఓడి.. మాగ్నస్ విజయం

వన్డేల విషయానికి వస్తే… శ్రేయాస్ అయ్యర్ 2017 నుంచి 2021 వరకు 22 మ్యాచ్‌లు ఆడి 813 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయ్యర్ 2022-23లో 20 మ్యాచ్‌ల్లో 818 పరుగులు చేశాడు. సగటు 51.12గా నమోదైంది. ఇందులో ఒక సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన శ్రేయాస్ అయ్యర్ పూర్తి పేరు శ్రేయాస్ సంతోష్ అయ్యర్. అతను రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా రాణిస్తున్న ప్రతిభ ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అయితే గాయం కారణంగా ఈ ఏడాది మొత్తం ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

నవీకరించబడిన తేదీ – 2023-08-24T19:22:02+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *