ప్రస్తుతం ఏపీలో దోమల బెడదతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరం, మలేరియా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఉన్నపల్లిలో గత 15 రోజులుగా డెంగ్యూ జ్వర పీడితులు ఎక్కువ మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. టీడీపీ హయాంలో దోమల నిర్మూలనకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ దోమల దండయాత్ర అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అపహాస్యం చేసింది. అంతేకాదు వైసీపీ అధికారంలోకి రాగానే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పెద్దగా నవ్వారు. మరి ఈరోజు సోషల్ మీడియా సాక్షిగా ప్రతి జిల్లాలో నమోదవుతున్న డెంగ్యూ జ్వరాలపై సమాధానం చెప్పేదెవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వర్షాకాలంలో పలు ప్రాంతాల్లో నీరు చేరడంతో అది తెగిపోయి ఆ నీటిపై దోమలు చేరుతున్నాయి. ఈ దోమలు మానవ నివాస ప్రాంతాల్లో సంచరించడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు హయాంలో దోమలై దండయాత్ర అనే కార్యక్రమాన్ని టీడీపీ అమలు చేసింది. కానీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఇది నచ్చలేదు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అభివృద్ధి ఎలా చేయాలో తెలియని పార్టీకి దోమల దండయాత్ర వింతగా అనిపించవచ్చు. అయితే ఇప్పుడు దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. దోమలు సంచరించే ప్రాంతాల్లో డ్రైనేజీలను శుభ్రం చేసి పురుగుల మందులు పిచికారీ చేసిన దాఖలాలు లేవు. దీంతో ప్రజలు డెంగ్యూ, మలేరియా, రోగాల బారిన పడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. 2019లో 5,286 కేసులు.. 2020లో 964 కేసులు.. 2021లో 4,760 కేసులు.. 2022లో 6,380 కేసులు.. ఈ ఏడాది ఆగస్టు 20 నాటికి 3,063 డెంగీ కేసులు నమోదయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 592, కర్నూలు జిల్లాలో 255, విజయనగరం జిల్లాలో 244, కడప జిల్లాలో 229 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 7 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,089 డెంగ్యూ నమూనాలను పరిశీలించగా 68 పాజిటివ్‌గా తేలింది. విశాఖలోని కేజీహెచ్‌లో 226 నమూనాలను పరిశీలించి 36 కేసులు నమోదైనట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: AP Politics: వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్.. సమాధానం చెప్పే దమ్ము ఉందా?
మరోవైపు మలేరియా జ్వరాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అధికారుల రికార్డుల ప్రకారం 2019లో 3,014, 2020లో 2,047, 2021లో 1,319, 2022లో 1,946 మలేరియా జ్వరాలు నమోదయ్యాయి.ఈ ఏడాది ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 2,561 మలేరియా కేసులు నమోదయ్యాయి. మన్యం జిల్లాలో 359, విజయనగరం జిల్లాలో 213, ఏలూరు జిల్లాలో 134, అనకాపల్లి జిల్లాలో 111 నమోదయ్యాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు 20 వరకు 3,588 మలేరియా కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి జగన్ హయాంలో క్షేత్రస్థాయిలో దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టమవుతోంది.
నవీకరించబడిన తేదీ – 2023-08-26T20:14:11+05:30 IST