తుమ్మల నాగేశ్వరరావు: కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల..! సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ సమక్షంలో చేరే అవకాశం.

తుమ్మల నాగేశ్వరరావు: కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల..!  సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ సమక్షంలో చేరే అవకాశం.

సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ లేదా మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.

తుమ్మల నాగేశ్వరరావు: కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల..!  సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ సమక్షంలో చేరే అవకాశం.

తుమ్మల నాగేశ్వరరావు

తుమ్మల: తెలంగాణలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో టికెట్ రాని ఆశావహులు పార్టీ అధిష్టానంపై భగ్గుమంటున్నారు. అయితే వారిని బుజ్జగించే పనిలో పార్టీ నాయకత్వం నిమగ్నమై ఉంది. కానీ, కొందరు బీఆర్ఎస్ ను వీడి… మరికొందరు పార్టీ మారే యోచనలో ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మలకు పాలేరు నియోజకవర్గం నుంచి టిక్కెట్టు ఆశించారు. కానీ, తుమ్మలకు బదులుగా గత ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి బీఆర్ ఎస్ పార్టీలో చేరిన కందాల ఉపేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించారు. దీంతో తుమ్మల, ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

తుమ్మనాల నాగేశ్వరో: బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై తుమ్మనల సీరియస్‌గా ఉన్నారు

పాలేరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం రాకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్న తుమ్మకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. తాను కచ్చితంగా పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అయితే, తుమ్మల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? వేరే పార్టీ నుంచి బరిలోకి దిగుతారా? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పాలేరు అభ్యర్థిగా తుమ్మల పోటీ చేసే అవకాశాలున్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.

తుమ్మల నాగేశ్వరరావు : ఖమ్మం జిల్లాతో రాజకీయ బంధాన్ని తెంచుకోవాలనుకున్నా ప్రజల కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తా: తుమ్మల

ఇప్పటికే తుమ్మలతో కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రేకు రాహుల్ గాంధీ అప్పగించినట్లు సమాచారం. దీంతో తుమ్మలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరితే.. రాష్ట్రంలోని దాదాపు 30 నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి తుమ్మలను పోటీకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తుమ్మల స్పష్టం చేసినట్లు సమాచారం.

మరోవైపు ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న తుమ్మల.. పార్టీ మారే విషయమై మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ లేదా మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *