డ్రగ్స్ కేసు: మాదాపూర్ డ్రగ్స్ పార్టీపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

డ్రగ్స్ కేసు: మాదాపూర్ డ్రగ్స్ పార్టీపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. మందు పార్టీ పెట్టి పట్టుబడ్డ టాలీవుడ్ నిర్మాత.

డ్రగ్స్ కేసు: మాదాపూర్ డ్రగ్స్ పార్టీపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

టాలీవుడ్ నిర్మాత వెంకట్‌ను హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు

డ్రగ్స్ కేసు: హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగంపై ఎంత నిఘా పెట్టినా నగరంలో డ్రగ్స్ రవాణా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. ముఖ్యంగా సినిమా, ఐటీ రంగానికి చెందిన వారు ఈ డ్రగ్స్‌ వినియోగంలో ఎక్కువగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ రెండు రంగాలకు చెందిన వారు పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఉదంతాలు చూశాం. తాజాగా మరో సినీ నిర్మాత డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తుండగా నార్కోటిక్ బ్యూరో విభాగానికి పట్టుబడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో చోటుచేసుకుంది.

Mahesh Babu – Nagarjuna : మహేష్ బాబుపై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్.. నాగార్జున వీడియోతో..!

చిత్ర నిర్మాత వెంకట్ మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. మూడు నెలలుగా వెంకట్‌పై నిఘా పెట్టిన నార్కోటిక్స్‌ బ్యూరో.. నిన్న ఆగస్టు 30 అర్ధరాత్రి అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నంబర్‌ 804లో జరుగుతున్న డ్రగ్స్‌ పార్టీని అడ్డుకుంది. ఈ దాడిలో ఎల్‌ఎస్‌డీ, కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న మొత్తం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ దాడిలో వెంకట్‌తో పాటు మరో ఐదుగురు కూడా పోలీసులకు చిక్కారు.

నటుడు విజయ్: దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమై.. చాలా ప్లానింగ్‌తో ఒక్కో అడుగు వేస్తున్నాడు.

ఈ ఐదుగురిని బాలాజీ, వెంకటేశ్వర్‌రెడ్డి, మురళి, మధుబాల, మెహక్‌లుగా గుర్తించారు. డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వాట్సాప్ చాట్‌లను కూడా పోలీసులు సేకరించారు. వీరికి గోవా నుంచి ఈ డ్రగ్స్ వస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి డ్రగ్స్ స్మగ్లర్లతో సంబంధాలు ఉండొచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దొరికిన నిర్మాత వెంకట్, బాలాజీ పేర్లు గతంలో కూడా డ్రగ్స్ కేసుల్లో వినిపించాయని అంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై నిఘా ఉంచినట్లు తెలిసింది. ఢమరుకం, ఆటోనగర్ సూర్య, పూలరంగడు, లవ్లీ.. వంటి చిత్రాలకు వెంకట్ నిర్మాతగా వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *