తెలంగాణలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో భారీ కసరత్తు చేస్తోంది. తొలి బ్యాచ్ జాబితాను త్వరలోనే ప్రకటించాలని భావిస్తున్నప్పటికీ..
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన వాయిదా పడింది
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కొనసాగుతోంది. సెప్టెంబర్ 10న తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల సైరన్ మోగించాలని భావించిన హస్తం పార్టీ.. ఆ ఆలోచనను వాయిదా వేసుకుంది. మరి కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు? ఈ వాయిదాకు కారణం ఏమిటి?
తెలంగాణలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో భారీ కసరత్తు చేస్తోంది. తొలి దశ జాబితాను వెంటనే ప్రకటించాలని భావించినా. దీంతో పాటు ఈ నెల 16 నుంచి హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న విడుదల చేయాల్సిన తొలి విడత జాబితాను తాత్కాలికంగా నిలిపివేశారు.
తొలి జాబితాలో 35 నుంచి 40 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని హస్తం పార్టీ నిర్ణయించింది. బలమైన నేతలు, సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవాలని భావించారు. కొందరు ఎంపీలు కూడా అసెంబ్లీ బరిలో నిలవాలన్నారు. కేంద్రం ఈసారి జమిలి ఎన్నికలకు వెళితే అభ్యర్థుల విషయంలో సమీకరణాలు మారే అవకాశం ఉంది. అందుకే సెప్టెంబర్ 22 వరకు జాబితాను పెండింగ్ లో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బండి సంజయ్.. ఏం చెబుతున్నారు?
మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికను దాదాపు ఓ కొలిక్కి తెచ్చింది. పార్టీ సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో స్క్రీనింగ్ కమిటీ చర్చలు జరిపింది. అభ్యర్థుల తుది ఎంపిక కోసం సర్వేలను కూడా పరిశీలించారు.
ఇది కూడా చదవండి: జూబ్లీహిల్స్ టికెట్ కోసం అజారుద్దీన్ తీవ్ర ప్రయత్నాలు.. విష్ణు పరిస్థితి ఏంటి?
మొత్తం 35 నుంచి 40 మంది ఒకే పేరుతో కేంద్ర ఎన్నికల కమిటీకి రిఫర్ చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇద్దరి పేర్లు, అత్యంత క్లిష్టమైన నియోజకవర్గాల్లో ముగ్గురి పేర్లను ప్రతిపాదించి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపారు. అయితే రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి.. కొత్తగా పార్టీలోకి వచ్చే సభ్యుల పేర్లను కూడా కేంద్ర కమిటీకి పంపాలని స్క్రీనింగ్ కమిటీలో నిర్ణయించారు. స్క్రీనింగ్ కమిటీతో మరోసారి సమావేశమై పేర్లను ఖరారు చేయాలని కమిటీ నేతలు నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాలు, సీడబ్ల్యూసీ సమావేశాల దృష్ట్యా సెప్టెంబర్ 22 వరకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం లేదు.