నిన్న మొన్నటి వరకు విశాల్ సినిమా ‘మార్క్ ఆంటోని’ విడుదలపై న్యాయపరమైన చిక్కుల వల్ల చిన్న సందేహాలు ఉన్నా, ఈరోజు అంతా క్లియర్ అయిందని విశాల్ ట్వీట్ చేశాడు.

మార్క్ ఆంటోనీ నుండి ఒక స్టిల్
తమిళ నటుడు విశాల్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ #మార్క్ ఆంటోని. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్ జె సూర్య ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నందున ఈ సినిమా అనుకున్న తేదీ సెప్టెంబర్ 15న రిలీజ్ అవుతుందా లేదా అని అంతా అనుకున్నారు. అందుకే రిలీజ్ చేయకపోవచ్చని కొందరు అనుకున్నారు.
విశాల్ సినిమాని నిలిపివేయాలంటూ లైకా ప్రొడక్షన్స్ చెన్నై కోర్టులో అప్పీలు చేసింది. విశాల్ స్వయంగా హాజరై కోర్టు రిజిస్ట్రార్ పేరుతో ఖాతా తెరిచి రూ. 21 కోట్లు డిపాజిట్ చేసి కోర్టుకు చూపించాలని, అప్పుడే సినిమా విడుదల సాధ్యమవుతుందని చెప్పింది.
అయితే వీటన్నింటికీ తెర దించేలా ఈరోజు విశాల్ ఓ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకి ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయని, ఈ నెల 15న సినిమాను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని, హిందీలో ఈ నెల 22న విడుదల చేస్తామని తెలిపారు. సినిమాపై కోర్టు స్టే వెలువరించిందని, సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవని అన్నారు. దీంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న సోలోగా విడుదల చేస్తున్నారు.
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఆ రోజు విడుదల కావాల్సిన ‘స్కంద’ చిత్రం #స్కంద 28కి వాయిదా పడింది. అలాగే ‘చంద్రముఖి 2’ #చంద్రముఖి2 కూడా 28కి వెళ్లింది.దీంతో విశాల్ వినాయక చవితి సెలవు కూడా కలిసొస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ డేట్ విశాల్ కి గొప్ప ఛాన్స్ అని కూడా అంటున్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-12T16:24:41+05:30 IST