గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్: తన కూతురి పేరు మీద 667 టాటూలతో ప్రపంచ రికార్డు సృష్టించిన తండ్రి

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్: తన కూతురి పేరు మీద 667 టాటూలతో ప్రపంచ రికార్డు సృష్టించిన తండ్రి

ఓ తండ్రికి తన కూతురింటే ఎంత ఇష్టమో.. తన శరీరంపై ఆమె పేరును 667 సార్లు టాటూగా వేయించుకున్నాడు. అతను అత్యధిక సార్లు అదే పేరుతో ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కలిగి ఉన్నాడు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్: తన కూతురి పేరు మీద 667 టాటూలతో ప్రపంచ రికార్డు సృష్టించిన తండ్రి

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్: ఒక తండ్రికి కూతురిపై ఎనలేని ప్రేమ. వారి బంధం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. UKకి చెందిన ఒక వ్యక్తి తన కూతురిని ఎంతగానో ప్రేమిస్తున్నాడంటే, ఆమె పేరును 667 సార్లు టాటూ వేయించుకున్నాడు. ప్రపంచ రికార్డు సాధించాడు. నిజమే.

గిన్నిస్ రికార్డ్: నిద్రలోనే 160 కి.మీ నడిచిన బాలుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసిన వింత కథ

జీవితంలో ఎంతగానో ప్రేమించే వ్యక్తుల పేర్లను టాటూలుగా వేయించుకుంటారు. అయితే UKకి చెందిన 49 ఏళ్ల మార్క్ ఓవెన్ ఎవాన్స్ తన శరీరంపై అదే పేరును ఎక్కువగా టాటూలుగా వేయించుకున్న వ్యక్తిగా ప్రపంచ రికార్డు సాధించాడు. తన కూతురు పేరు మీద 667 సార్లు టాటూ వేయించుకున్నందుకు ఆది గిన్నిస్ రికార్డు సృష్టించాడు. 2017లో, ఓవెన్ ఎవాన్స్ తన కూతురు లూసీ పేరును తన వీపుపై 267 సార్లు టాటూ వేయించుకున్నాడు. అప్పుడే అతనికి గిన్నిస్‌ రికార్డు వచ్చింది. కానీ 2020లో, USAకి చెందిన 27 ఏళ్ల డీడ్రా విజిల్ 300 టాటూలతో అతని రికార్డును అధిగమించింది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్: వీపుపై నిప్పు పెట్టుకుని 100 మీటర్లు పరిగెత్తిన ఫైర్ ఫైటర్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు

ఎవాన్స్ తన పాత రికార్డును తిరిగి పొందాలని నిశ్చయించుకున్నాడు. అతను లూసీ అని మరో 400 టాటూలు వేయించుకున్నాడు. దాంతో మొత్తం 667 టాటూలుగా మారాయి. ఈసారి తన తొడలపై టాటూలు వేయించుకున్నాడు. ఒక్కో తొడపై 200 చొప్పున 400 టాటూలు వేయడానికి ఇద్దరు టాటూ ఆర్టిస్టులకు ఐదున్నర గంటల సమయం పట్టింది. మరోవైపు, ఎవాన్స్ కుమార్తె పేరిట అత్యధిక సంఖ్యలో టాటూలు వేయించుకున్న ప్రపంచ రికార్డును కూడా అతను సొంతం చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *