సాలార్ సినిమా: పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ రాబోయే చిత్రం “సాలార్”. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా.. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్‌లుగా కనిపించబోతున్నారు. “కేజీఎఫ్` చిత్రాన్ని నిర్మించిన హోంబాలే ఫిలింస్ దీన్ని నిర్మిస్తుండడం గమనార్హం. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రభాస్ అభిమానులను నిరాశపరచడంతో అభిమానులంతా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
అయితే గత కొంత కాలంగా ఈ సినిమా వాయిదా పడిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా సినిమాలు కూడా ఆ రిలీజ్ డేట్ లోనే తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి. నిర్మాణానంతర పనులు పూర్తి కాలేదని, సీజీ వర్క్ కూడా పూర్తి కాలేదని, అందుకే సినిమా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇన్నాళ్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించకపోయినప్పటికీ సాలార్ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయడం లేదని, వాయిదా వేసినట్లు అందరికీ తెలిసిపోయింది. అందుకే సాలార్ వాయిదా పడిందా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పాలని ప్రభాస్ అభిమానులు చిత్ర యూనిట్‌ని కోరుతున్నారు. తాజాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ నోరు విప్పింది.
సాలార్ వాయిదాపై టీమ్ సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో.. సాలార్ సినిమాను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. వివిధ కారణాల వల్ల సెప్టెంబర్ 28న సినిమా విడుదల కాలేదు.. మీకే అర్థమవుతుందని భావిస్తున్నాం. మా చిత్ర యూనిట్ మీకు మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి ప్రయత్నిస్తోంది. సాలార్ కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్రకటించారు.
మీ తిరుగులేని మద్దతును మేము ఎంతో అభినందిస్తున్నాము #సాలార్. పరిగణనలోకి తీసుకుంటే, అనుకోని పరిస్థితుల కారణంగా మేము అసలు సెప్టెంబర్ 28 విడుదలను ఆలస్యం చేయాలి.
అసాధారణమైన సినిమా అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నందున, ఈ నిర్ణయం జాగ్రత్తగా తీసుకున్నట్లు దయచేసి అర్థం చేసుకోండి.… pic.twitter.com/abAE9xPeba— హోంబలే ఫిల్మ్స్ (@hombalefilms) సెప్టెంబర్ 13, 2023
పోస్ట్ సాలార్ మూవీ : ప్రభాస్ “సాలార్” సినిమా వాయిదా.. మేకర్స్ అధికారిక ప్రకటన! మొదట కనిపించింది ప్రైమ్9.