చివరిగా నవీకరించబడింది:
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ ఈ నెలలో పలు బహిరంగ సభల్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా దేశం నుంచి తరిమి కొట్టాలని వ్యాఖ్యానించారు.
ఉదయనిధి స్టాలిన్: సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ ఈ నెలలో పలు బహిరంగ సభల్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా దేశం నుంచి తరిమి కొట్టాలని వ్యాఖ్యానించారు.
14 మందికి నోటీసులు..(ఉదయనిధి స్టాలిన్)
ఈ నేపథ్యంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఏ రాజాతోపాటు మరో 14 మందికి తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ 14 మందిలో సీబీఐతో పాటు తమిళనాడు పోలీసులకు నోటీసులు పంపారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నెల ప్రారంభంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోల్చారు.
తమిళనాడులో పలు బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా దేశం నుంచి తరిమి కొట్టాలని అన్నారు. డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనా వంటి వాటిని ఎదిరించలేమని, వాటిని పూర్తిగా నిర్మూలించాల్సిందేనని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని కూడా దేశం నుంచి తరిమి కొట్టాలని ఘూటుగా వ్యాఖ్యానించారు. అయితే స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇదిలావుండగా, తన వ్యాఖ్యల నుంచి వెనక్కి తగ్గేది లేదని స్టాలిన్ స్పష్టం చేశారు.