విశ్వనాయకుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని సంచలన నిజాన్ని బయటపెట్టాడు. శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు

విశ్వనాయకుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని సంచలన నిజాన్ని బయటపెట్టాడు. శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 20-21 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా.. ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావడం, తగిన గుర్తింపు రావడం లేదని బాధపడ్డాను. నేను చనిపోతే ఇంతటి ప్రతిభావంతుడైన ఆర్టిస్ట్‌ని పోగొట్టుకున్నందుకు సినీ పరిశ్రమ బాధపడుతుంది.. అదే విషయం మా గురువు అనంత్‌కి చెప్పాను.. నీ పని నువ్వు చేసుకో.. ఆ గుర్తింపు సమయం వచ్చినప్పుడు దానంతట అదే వస్తుందని ధైర్యం చెప్పాడు. అన్నది నిజమే.ఆయన మాటలు విని ఆత్మహత్య చేసుకోవడం సరికాదు.ఆత్మహత్య చేసుకోవడం ఎంత నేరమో,హత్య చేసినంత పాపమో.జీవితంలో చీకట్లు శాశ్వతంగా ఉండవు.ఎవరి జీవితంలోనైనా వెలుగు వస్తుంది.అంతం అబ్దుల్ కలంగారు చెప్పినట్టు మనం నిద్రపోతే వచ్చేది కల కాదు.. అసలు కల మనల్ని నిద్రపోకుండా చేస్తుంది.చావు కూడా జీవితంలో ఒక భాగమే.. కానీ మనం దాని కోసం ఎదురుచూడకూడదు.మీరే గుర్తుపెట్టుకోండి. రాత్రి నిద్రపోయే ముందు కలలు, లక్ష్యం నెరవేరుతుందా.. లేదా?.. అది పక్కన పెట్టండి.. అందుకు ఏం చేయాలో ఆలోచించండి..’’ అని ఆ సమావేశంలో కమల్ అన్నారు.
విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కమల్ ప్రస్తుతం తెలుగులో ‘ఇండియన్ 2’, ‘కల్కి 2898AD’, వినోద్ దర్శకత్వంలో ‘కమల్ హాసన్ 233’, మణిరత్నం దర్శకత్వంలో ‘కమల్ 234’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-24T14:57:24+05:30 IST