టైగర్ నాగేశ్వరరావు: టైగర్ కా హుకుం.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-09-27T16:37:29+05:30 IST

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ డేట్‌ని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 3న విడుదల కానుంది.

టైగర్ నాగేశ్వరరావు: టైగర్ కా హుకుం.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టైగర్ నాగేశ్వరరావు సినిమా స్టిల్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన గ్రిప్పింగ్ టీజర్ మరియు చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో టైగర్ దేశవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ పై కాన్సట్రేట్ చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడానికి సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 3న ఈ సినిమా ట్రైలర్‌ని ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.ఈ విషయాన్ని తెలియజేస్తూ భారీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

పులి-2.jpg

ఈ పోస్టర్‌లో రవితేజ అడవిలో పులిని వేటాడేలా ప్రత్యర్థులపై దాడి చేస్తున్నాడు. ఇందులో రవితేజ బీడీ తాగుతూ డాషింగ్‌గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే అక్టోబర్ 20న పులుల వేట మామూలుగా ఉండదని అర్థమవుతోంది. రవితేజ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఫ్యాన్స్‌కి ఫుల్‌ మీల్స్‌లా ఉంటుందని మేకర్స్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. (టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ విడుదల తేదీ)

TNR.jpg

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండు పాటలను మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేశారు. రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ మధి ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

==============================

*******************************************

*******************************************

*******************************************

****************************************

నవీకరించబడిన తేదీ – 2023-09-27T16:37:29+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *