టీమ్ ఇండియా వరల్డ్ కప్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో, టీమ్ ఇండియా అతడికి దూరమైంది. అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ని ప్రకటించారు.

వన్డే ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసేందుకు అన్ని జట్లకు ఐసీసీ ఈ నెల 28 వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా వరల్డ్ కప్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో, టీమ్ ఇండియా అతడికి దూరమైంది. అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ని ప్రకటించారు. దీంతో టీమిండియా సీనియర్ ఆటగాడు అశ్విన్ కెరీర్ లో మూడో వన్డే ప్రపంచకప్ ఆడబోతున్నాడు. 2011, 2015 వన్డే ప్రపంచకప్‌ల తర్వాత ఇప్పుడు 2023 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇది కూడా చదవండి: ODI వరల్డ్ కప్ 2023: మెగా టోర్నీకి దూరమవుతున్న స్టార్ ఆటగాళ్లు వీరే..!!
కాగా, చాలా కాలం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పునరాగమనం చేసిన రవిచంద్రన్ అశ్విన్ రెండు మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో వన్డేల్లోనూ రాణించగలనని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అతనికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. నిజానికి మూడో వన్డేలో అశ్విన్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వస్తాడని కెప్టెన్ రోహిత్ శర్మ సూచించాడు. అశ్విన్ క్లాస్ బౌలర్ అని, ఒత్తిడిలో ఎలా ఆడాలో తెలిసిన అనుభవజ్ఞుడైన ఆటగాడు అని కొనియాడాడు. గతేడాది నుంచి వన్డేలు ఆడనప్పటికీ గత రెండు మ్యాచ్‌ల్లో తన బౌలింగ్ స్థాయిని కనబర్చాడని రోహిత్ వివరించాడు. బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఆసియా వన్డే కప్-2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన అక్షర్ పటేల్ ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పాటు మెగా టోర్నీకి కూడా దూరమయ్యాడు. అక్షర్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.
నవీకరించబడిన తేదీ – 2023-09-28T20:17:20+05:30 IST