రైతుబంధు రూపంలో రైతులకు రూ.73 వేల కోట్లు అందించాం: మంత్రి కేటీఆర్

జిల్లాలో చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయన్నారు. కృష్ణా జలాలను పాలమూరు భూములకు తరలించారన్నారు. వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు.

రైతుబంధు రూపంలో రైతులకు రూ.73 వేల కోట్లు అందించాం: మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ (3)

కేటీఆర్ – రైతు బంధు: రైతుకు పెట్టుబడి అందించాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుబంధు రూపంలో రైతులకు రూ.73 వేల కోట్లు అందించామన్నారు. రైతుల కోసం రైతుబీమా పథకాన్ని ప్రారంభించామన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డి పల్లిలో 40 ఎకరాల్లో రూ.300 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న యూనిక్‌ ఆయిల్‌ ఫామ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నిర్మాణానికి శుక్రవారం మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ రాములు, కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆంజనేయులుగౌడ్‌, రజినీ సాయిచంద్‌, వాల్యానాయక్‌ పాల్గొన్నారు. పాలమూరు జిల్లాలో వలసలు ఉన్నాయని… నేడు సాగునీరు ఉందన్నారు. పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో పాలమూరు రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను తీర్చిదిద్దుతున్నామన్నారు.

ప్రభుత్వం అలా చేస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను: కోమటిరెడ్డి వెంకట రెడ్డి

జిల్లాలో చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయన్నారు. కృష్ణా జలాలను పాలమూరు భూములకు తరలించారన్నారు. వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. విదేశాల నుంచి వంటనూనెలు దిగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. విదేశాల నుంచి లక్షల టన్నులు దిగుమతి అవుతున్నాయన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మా ప్రజాప్రతినిధులు తమ పొలాల్లో ఆయిల్ ఫామ్స్ సాగు చేసుకుంటున్నారని వెల్లడించారు. రైతులకు భరోసా కల్పిస్తున్నామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టరీ జోన్ల ఏర్పాటు : మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టరీ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయిల్ ఫేమ్ పండించేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలిసారిగా ఆయిల్ ఫాం కంపెనీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *