ఉస్తాద్ భగత్ సింగ్ : “ఉస్తాద్ భగత్ సింగ్” నుండి బ్లాస్టింగ్ అప్ డేట్.. ఈసారి ప్రదర్శన మామూలుగా లేదు!

ఉస్తాద్ భగత్ సింగ్ గురించి హరీష్ శంకర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది

ఉస్తాద్ భగత్ సింగ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఒక సినిమా తర్వాత మరో సినిమా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో “ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి.. దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో పదేళ్ల క్రితం విడుదలైన గబ్బర్ సింగ్ ఎంతటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ వీరిద్దరి కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, అశుతోష్ రానా, కేజీఎఫ్ అవినాష్, నవాబ్ షా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఒక అప్‌డేట్ ఇచ్చారు. ఆ పోస్ట్‌లో.. క్లాప్ బోర్డు, క్యాప్‌తో ఉన్న ఫోటోను హరీష్ శంకర్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. “సినిమా యొక్క చాలా ముఖ్యమైన మరియు ఇంటెన్సివ్ షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసాము మరియు షెడ్యూల్‌ని ప్యాక్ చేసాము. పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి.

 

 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’, వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ ఫేమ్ సాక్షి వైద్య మరో కథానాయికగా నటిస్తున్నారు. ఆనంద్ సాయి ఈ చిత్రానికి (ఉస్తాద్ భగత్ సింగ్) ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో పాటు సుజీత్ దర్శకత్వంలో ‘ఓజి’, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ వంటి సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఓ సినిమా కూడా చేయాల్సి ఉంది.

పోస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ : “ఉస్తాద్ భగత్ సింగ్” నుండి బ్లాస్టింగ్ అప్ డేట్.. ఈసారి ప్రదర్శన మామూలుగా లేదు! మొదట కనిపించింది ప్రైమ్9.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *