ఎన్ఐఏ దాడులు: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఎన్ఐఏ అధికారుల సోదాలు.. భారీగా పోలీసుల మోహరింపు

ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. అమరుల బంధు మిత్రుల సంఘం, పౌరహక్కుల సంఘం ముఖ్య నేతల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

ఎన్ఐఏ దాడులు: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఎన్ఐఏ అధికారుల సోదాలు.. భారీగా పోలీసుల మోహరింపు

NIA దాడులు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్, వరంగల్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లోని పలువురు పౌరహక్కుల నేతల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు కొనసాగించారు. సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. అమరుల బంధు మిత్రుల సంఘం, పౌరహక్కుల సంఘం ముఖ్య నేతల ఇళ్లలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై ఈ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also : చంద్రబాబు అరెస్ట్: టీడీపీ ఆధ్వర్యంలో ‘సత్యమేవ జయతే’ దీక్షలు.

హైదరాబాద్‌లోని అల్వాల్‌లో నివసిస్తున్న భవానీ, న్యాయవాది సురేష్‌ ఇళ్లలో, వరంగల్‌ జిల్లా అనిత, శాంతమ్మ ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉంటున్న ఎల్లంకి వెంకటేశ్వర్లు, తిరుపతిలో ఉంటున్న క్రాంతి చైతన్య ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగాయి. నెల్లూరులోని అరుణ ఇంట్లో, గుంటూరులోని డాక్టర్ రాజారావు ఇంట్లో, శ్రీకాకుళం జిల్లాలోని కేఎన్‌పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్కా కృష్ణయ్య ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగాయి. అదే విధంగా ప్రకాశం జిల్లా కుల నిర్మూలన పోరాట నాయకుడు దుడ్డు వెంకటరావు, సంతమాగులూరులో ఓరు శ్రీనివాసరావు, రాజమండ్రి బొమ్మేరులో పౌరహక్కుల నాయకుడు నాసర్, హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి కోనాల లాజర్ ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఇంకా చదవండి : తమిళ బిగ్ బాస్ 7 : తమిళ్ నాథ్ మొదలైన బిగ్ బాస్ సందడి.. తమిళ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ పూర్తి జాబితా..

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం అల్లిపురంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కావలి బాలయ్యను ఎన్ఐఏ పోలీసులు విచారించారు. ఈ విచారణలో భాగంగా మావోయిస్టులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. బాలయ్య KNPS సంస్థ జిల్లా అధ్యక్షులు. తాజాగా ఎన్ఐఏ రాష్ట్ర అధ్యక్షుడు దొందు ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నెల్లూరు జిల్లా ఫతేఖాన్ పేట రైతుబజార్ సమీపంలోని చైతన్య మహిళా సంఘం నాయకురాలు అన్నపూర్ణమ్మ నివాసంలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో కూడా అన్నపూర్ణ, అనూష ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని మచ్చువాని పేటలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. కుల నిర్మూలన పోరాట వామపక్ష భావజాల నాయకుడు మస్కా కృష్ణయ్య ఇంట్లో సోదాలు కొనసాగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *