స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం వాయిదా వేసింది. తమ వాదనలు వినిపించేందుకు కేవియట్ దాఖలు చేసిన ప్రభుత్వం.. ఈ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ఎదుట రెండు వేల పేజీల వరకు పత్రాలను సమర్పించింది. దీంతో ఆ పత్రాలన్నీ సమర్పించాలని ఆదేశించి తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందా లేదా అనే దానిపై వాదనలు జరిగాయి. అవినీతి నిరోధక చట్టంలో 2018లో ఈ సెక్షన్ తీసుకొచ్చామని.. ఈ కేసు 2021లో నమోదైనందున 17ఏ వర్తిస్తుందని చెప్పారు. అయితే 2015లో నేరం జరిగిందని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.కానీ చంద్రబాబు తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ 17ఏలో ఎఫ్‌ఐఆర్ నమోదు తేదీ గురించి మాట్లాడుతున్నారని వాదించారు. ఈ విషయాన్ని సిద్ధార్థ లుద్రా కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని.. ఎన్నికలు వస్తున్న తరుణంలో చంద్రబాబును ఎక్కువ కాలం జైల్లో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని లుద్ర ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
హైకోర్టు తీర్పును రోహత్గీ వ్యూహాత్మకంగా చెప్పడంతో.. తాము సమర్పించిన పత్రాల గురించి, నిర్ణయం తీసుకునే ముందు వాటిని పరిశీలించాలని ధర్మాసనం భావించింది. కానీ చంద్రబాబు చాలా రోజులు జైలులో ఉన్నారని లుద్ర ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు బెయిల్ కోరడం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది రోహత్గీ తెలిపారు. మొత్తానికి చంద్రబాబు వచ్చే సోమవారం కోసం ఎదురు చూడాల్సిందే.
పోస్ట్ వచ్చే సోమవారం మళ్లీ చంద్రబాబు కోసం ఎదురుచూపులు! మొదట కనిపించింది తెలుగు360.