పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక: ఆ ఇద్దరు ఆటగాళ్లు సెంచరీ చేశారు. శ్రీలంకపై పాకిస్థాన్ విజయం సాధించింది

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-10-10T23:09:43+05:30 IST

2023 ప్రపంచకప్‌లో మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. చివరి వరకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో.

పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక: ఆ ఇద్దరు ఆటగాళ్లు సెంచరీ చేశారు.  శ్రీలంకపై పాకిస్థాన్ విజయం సాధించింది

2023 ప్రపంచకప్‌లో మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాకిస్థాన్ ఛేదించింది. అబ్దుల్లా షఫీక్ (113), మహ్మద్ రిజ్వాన్ (131) సెంచరీలు చేయడంతో పాక్ ఈ విజయం సాధించింది. ముఖ్యంగా నాలుగో నంబర్‌లో దిగి వచ్చిన రిజ్వాన్ చివరి వరకు క్రీజులో నిలిచి తన జట్టును గెలిపించేలా హీరోగా నిలిచాడు.

తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. కుసాల్ మెండిస్ (122), సమరవిక్రమ (108) సెంచరీలతో.. నిశాంక (51) అర్ధ సెంచరీతో చెలరేగడంతో.. శ్రీలంక జట్టు ఇంత భారీ స్కోరు చేయగలిగింది. నిజానికి.. ఈ ముగ్గురు ఆటగాళ్ల దూకుడు చూసి శ్రీలంక జట్టు 370-380 పరుగులు చేస్తుందని భావించారు. కానీ, ఆ ముగ్గురు మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌లు రాణించకపోవడంతో 344 పరుగులకే పరిమితమయ్యారు. 345 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 48.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసి విజయఢంకా మోగించింది.

తొలుత ఇమామ్ (12), బాబర్ (10) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరినా.. పాక్ జట్టు కష్టాల్లో పడినట్లే. తర్వాత అబ్దుల్లా, రిజ్వాన్‌లు అడ్డుగోడలా నిలిచి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 176 పరుగులు జోడించారు. మధ్యలో ఆడుతూనే అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదాడు. అబ్దుల్లా అవుట్ అయిన తర్వాత రిజ్వాన్ వెన్నుదన్నుగా నిలిచాడు. చివరి వరకు క్రీజులో నిలిచి… షకీల్ (31), ఇఫ్తికార్ (22) రాణించడంతో జట్టును గెలిపించాడు. ఇరు జట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించడంతో మైదానంలో ఉన్న ప్రేక్షకులు మ్యాచ్‌ను ఎంతగానో ఆస్వాదించారు.

నవీకరించబడిన తేదీ – 2023-10-10T23:09:43+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *