రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తరహాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్‌ను రూపొందించారు.
మేం వచ్చాక టీఎస్‌పీఎస్సీ యూపీఎస్సీలా ఉంటుంది: రాహుల్ గాంధీ
హైదరాబాద్/న్యూఢిల్లీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. ఇదీ మేం ఇస్తున్న హామీ అని చెప్పారు. ప్రవళిక ఆత్మహత్య అత్యంత బాధాకరం. ప్రవళికను ఆత్మహత్యగా చూడొద్దు.. నిరుద్యోగ యువత కలలు, ఆశలను ఈ ప్రభుత్వం చంపేసింది. శనివారం ఆయన ఎక్స్‌పై ఈ మేరకు వరుస పోస్ట్‌లు చేశారు.గత పదేళ్లలో తెలంగాణలో బీజేపీ రిష్టేదార్ సమితి (బీజేపీతో సంబంధాలున్న బీఆర్‌ఎస్) తన అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. మరోవైపు, టీఎస్‌పీఎస్సీ పరీక్షలను పదే పదే వాయిదా వేయడంతో 23 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్ర కలచివేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. పరీక్షల నిర్వహణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో వేలాది మంది అభ్యర్థులు నిరాశ, ఆగ్రహానికి గురవుతున్నారు. “తెలంగాణ యువత అవినీతి, అసమర్థ బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొడుతుంది” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రవళిక ఆత్మహత్యపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం పదే పదే పరీక్షలను వాయిదా వేస్తూ నిరుద్యోగ యువతను ఇబ్బందులకు గురిచేయడం సిగ్గుచేటన్నారు.
కేసీఆర్ పాలనలో ప్రాణాలకు విలువ లేదు: రేవంత్
కేసీఆర్ మాట వినడం లేదని, ఆయన పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు. ‘‘గ్రూప్ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని ఈ పాలకులను తన్ని తరిమి కొట్టాలి.. నిరుద్యోగ భృతి తీసుకుంటున్న ఈ పాలకులను రానున్న ఎన్నికల్లో గద్దె దించాలి.. ప్రవళిక ఆత్మహత్య ఘటనలో న్యాయం చేయాలని వేల గొంతులు కేకలు వేస్తున్నా కేసీఆర్. వినడం లేదు.. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు గతి లేదని ప్రవళిక సూసైడ్ నోట్ స్పష్టం చేస్తోంది. ప్రవళిక కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. ‘‘ఎక్కడ నక్కలు నిరుద్యోగుల విధితో చెలగాటమాడింది.. వారిని దోషులుగా మారుద్దాం’’ అని వ్యాఖ్యానించారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-15T03:48:21+05:30 IST