బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-10-20T11:16:10+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వేసిన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వేసిన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు విన్న అనంతరం విచారణ జరిగింది నవంబర్-08సుప్రీం కోర్టు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది అయితే చంద్రబాబు తరపు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు కోర్టు నవంబర్ 9కి వాయిదా వేసింది. అప్పటి వరకు పీటీ వారెంట్‌పై యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై తీర్పు తర్వాత ఫైబర్ నెట్ కేసును పరిగణనలోకి తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

అరెస్టు చేయవద్దు!

అయితే అప్పటి వరకు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయబోమని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు కేసు దర్యాప్తునకు తమను అనుమతించాలంటూ సీఐడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. చంద్రబాబును అరెస్ట్ చేయలేమని సీఐడీ, ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీం నిర్ణయంతో చంద్రబాబుకు కాస్త ఊరట లభించింది. సుప్రీంకోర్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా. త్రివేదితో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది.

కాగా.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం.. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయరాదని ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. అయితే నవంబర్-08న సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.

నవీకరించబడిన తేదీ – 2023-10-20T13:59:20+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *