టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు జైలు నుంచి ఏపీ ప్రజలకు, టీడీపీ శ్రేణులకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో సమావేశమైన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తన అభిప్రాయాలు, ఆలోచనలను లేఖ రాయాలని చంద్రబాబు కోరారు. దీనితో..

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు జైలు నుంచి ఏపీ ప్రజలకు, టీడీపీ శ్రేణులకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో సమావేశమైన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తన అభిప్రాయాలు, ఆలోచనలను లేఖ రాయాలని చంద్రబాబు కోరారు. దీంతో కుటుంబ సభ్యులు బాబు చెప్పిన అంశాలను పొందుపరుస్తూ ఆయన పేరుతో లేఖ విడుదల చేశారు. ఈ లేఖ చదివిన తెలుగు వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడు ఈ లేఖపై ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లేఖపై సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న బాబు.. జైల్లో ఉన్నా రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్నాడని సామాన్యులు సైతం చెప్పుకునే పరిస్థితి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కరపత్రంపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు స్పందించారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ ఒక ప్రకటన విడుదల చేశారు.
మాకు సంబంధం లేదు..!
‘చంద్రబాబు సంతకంతో కూడిన కరపత్రం జైలు నుంచి వెలువడింది కాదు. ఆయన సంతకంతో విడుదల చేసిన కరపత్రానికి జైలుకు ఎలాంటి సంబంధం లేదు. జైలు నిబంధనల ప్రకారం, నిందితుల్లో ఎవరైనా సంతకం చేసిన కరపత్రాలను విడుదల చేయాలనుకుంటే, పేర్కొన్న పత్రాన్ని జైలు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, దానిని జైలర్ ధృవీకరించి సంబంధిత కోర్టులు లేదా ఇతర ప్రభుత్వ శాఖలు మరియు కుటుంబ సభ్యులకు పంపుతారు. జైలు సంతకం మరియు ముద్రతో. అందువల్ల చంద్రబాబు కరపత్రానికి ఈ జైలుకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం‘ రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు.
జైలు అధికారుల లేఖ ఇది.
లోకేష్ కన్నెర్ర..!
ఈ లేఖపై టీడీపీ యువనేత నారా లోకేష్ స్పందించారు. ‘జగన్ జమనలో లేఖ రాయడం కూడా దేశద్రోహమేనా? నిబంధనలకు విరుద్ధంగా పెన్ కెమెరాతో వీడియోలు తీస్తున్న అధికారులకు జైలు నిబంధనలు గుర్తుకు రాలేదా?. చేయని తప్పుకు 44 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ములకత్ లో భాగంగా ప్రజలకు చెప్పాలనుకున్న విషయాలన్నీ మాతో పంచుకున్నారు. రాజభవన ఆదేశాలకు భయపడి లేఖ రాయడం కూడా నేరమని, రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి నెలకొందని పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. నాలుగు గోడల మధ్యే పరిమితమైనా జగన్ కు పార్టీ దొరకడం లేదు. చివరకు లేఖ రాసే హక్కు కూడా లేదని వేధిస్తున్నారు‘ జగన్ సర్కార్ పైనా, జైలు అధికారులపైనా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు లేఖ ఇదీ..
నవీకరించబడిన తేదీ – 2023-10-22T22:35:08+05:30 IST