కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాలస్తీనా జెండాలు కనిపించాయి. మ్యాచ్ చూసేందుకు వచ్చిన కొందరు క్రికెట్ అభిమానులు స్టాండ్స్ లో పాలస్తీనాకు మద్దతుగా పాలస్తీనా జెండాలతో కనిపించారు.

వన్డే ప్రపంచకప్ కొన్ని సంచలనాలు, కొన్ని మెరుపులతో సాగుతోంది. అయితే మంగళవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాలస్తీనా జెండాలు కనిపించాయి. ప్రస్తుతం పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ లో పాలస్తీనా జెండాలు కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన కొందరు క్రికెట్ అభిమానులు స్టాండ్స్ లో పాలస్తీనాకు మద్దతుగా పాలస్తీనా జెండాలతో కనిపించారు. భారత్ ఇప్పటికే పాలస్తీనాకు మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు వస్తోంది. క్రికెట్ అభిమానులు పాలస్తీనా జెండాలను ప్రదర్శించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, ఈడెన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ టోర్నీలో బంగ్లాదేశ్ ఆరో ఓటమితో సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసింది. బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఓపెనర్ల ఆటతీరుతో లక్ష్యాన్ని సులువుగా అందుకుంది. 205 పరుగుల లక్ష్యాన్ని 32.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కాగా, నవంబర్ 2న ఇదే మైదానంలో భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది.
నవీకరించబడిన తేదీ – 2023-10-31T21:52:36+05:30 IST