పుణెలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో డి కాక్ మరో సెంచరీ సాధించాడు. ఈ మెగా టోర్నీలో అతనికిది నాలుగో సెంచరీ.

దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు, ఓపెనర్ క్వింటన్ డి కాక్ వన్డే ప్రపంచకప్ 2023లో వీరోచిత ప్రదర్శన చేస్తూ.. ఏ జట్టులో ఉన్నా.. సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. పుణె వేదికగా ఈరోజు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డి కాక్ మరో సెంచరీ సాధించాడు. ఈ మెగా టోర్నీలో అతనికిది నాలుగో సెంచరీ. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఆటగాడు డి కాక్. ఈ జాబితాలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. 2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 5 సెంచరీలు చేశాడు. కానీ ప్రస్తుత టోర్నీలో డి కాక్ ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు సాధించాడు. మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే మరో సెంచరీ సాధిస్తే రోహిత్ రికార్డును అధిగమించే దిశగా డి కాక్ ఉన్నాడు.
ఇది కూడా చదవండి: వన్డే ప్రపంచకప్: బీసీసీఐ కీలక నిర్ణయం… ఆ రెండు స్టేడియాల్లో ఫైర్ వర్క్స్ పై నిషేధం
ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో డి కాక్‌కు ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. 50 పరుగులు దాటితే ఆ స్కోరును సెంచరీగా మార్చేస్తాడు. ఈ మెగా టోర్నీలో శ్రీలంకపై 84 బంతుల్లో 100 పరుగులు చేసిన డి కాక్.. ఆస్ట్రేలియాపై 106 బంతుల్లో 109 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌పై 140 బంతుల్లో 174 పరుగుల భారీ స్కోరు సాధించాడు. ఇప్పుడు న్యూజిలాండ్‌పై 116 బంతుల్లో 114 పరుగులు చేశాడు. మరోవైపు వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు డికాక్ 24 మ్యాచ్‌లు ఆడి నాలుగు సెంచరీలు సాధించాడు. ఇదంతా ప్రస్తుత ప్రపంచకప్ లోనే కావడం గమనార్హం. ఈ ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటానని.. ఇదే తన చివరి వన్డే ప్రపంచకప్ అని డికాక్ గతంలోనే ప్రకటించాడు. భారత గడ్డపై డికాక్‌కి ఇది ఆరో వన్డే సెంచరీ. భారత గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో డివిలియర్స్ ఏడు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
నవీకరించబడిన తేదీ – 2023-11-01T17:06:41+05:30 IST