గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ నిర్మిస్తున్న 50వ సినిమా ఇది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘జరగండి.. జరగండి’ పాటను దీపావళికి విడుదల చేయనున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ నిర్మిస్తున్న 50వ సినిమా ఇది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘జరగండి.. జరగండి’ పాటను దీపావళికి విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క పాట కూడా విడుదల కాలేదు. కానీ ఆడియో రైట్స్ ద్వారా కోట్లు కొల్లగొడుతుంది. ఈ సినిమా ఆడియో హక్కులను సరిగమ సొంతం చేసుకుంది. ఆడియో హక్కుల కోసం రూ. 33 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు సదరు ఆడియో సంస్థ అంగీకరించిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక్క పాట కూడా విడుదల కాలేదు. అయితే ఓ ఆడియో సంస్థ ఇంత మొత్తం చెల్లించేందుకు సిద్ధపడడం విశేషం! ఈ మధ్య కాలంలో వచ్చిన పాన్ ఇండియా సినిమాలలో ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టిందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. శంకర్ సినిమాల్లో పాటలు ప్రత్యేకం. సౌత్ ఇండియాలో పాటలకు శంకర్ భారీతనం తీసుకొచ్చాడని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తుండడంతో ఆడియో రైట్స్ రూ. 33 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. ప్రస్తుతం సంగీత దర్శకుడు థమన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ట్యూన్స్‌ని అందించాడు. ఈ సినిమా ఆడియో రైట్స్ ఇంత ఖర్చు కావడానికి అది కూడా ఒక కారణం. (ఆడియో రైట్స్ 33 కోట్లు)
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తోంది. ‘వినయ విధేయ రామ’ తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటిస్తున్న చిత్రమిది. అంజలి మరో కథానాయిక. సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆ సినిమా హక్కులను సోనీ మ్యూజిక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు కూడా భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
నవీకరించబడిన తేదీ – 2023-11-09T16:52:41+05:30 IST