అజాగ్రత: ‘అజాగ్రత’లో కర్ణాటక మాజీ సీఎం భార్య..

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-11-13T01:32:28+05:30 IST

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య కన్నడ నటి అలియాస్ కుట్టి రాధిక ‘అజాగ్రత’ సినిమాతో ఇండియా వైడ్ ప్రేక్షకులను పలకరించనుంది. కర్ణాటకలో సూపర్ హిట్ బ్యానర్ అయిన శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శశిధర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. నటి రాధిక కుమారస్వామి పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

అజాగ్రత: 'అజాగ్రత'లో కర్ణాటక మాజీ సీఎం భార్య..

అజాగ్రతలో రాధికా కుమారస్వామి

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సతీమణి కన్నడ నటి అలియాస్ రాధికా కుమారస్వామి ‘అజాగ్రత’ సినిమాతో ఇండియా వైడ్ ప్రేక్షకులను పలకరించనుంది. కర్ణాటకలో సూపర్ హిట్ బ్యానర్ అయిన శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శశిధర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అమేజింగ్ సెట్స్ ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి రవిరాజ్ నిర్మాత. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

రాధికా కుమారస్వామి పుట్టినరోజు సందర్భంగా ఏడు భాషల్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ లో రాధిక నిండుగా ఎర్రటి చీరలో నిండుగా నగలతో కనిపిస్తోంది. పోస్టర్‌లో లైట్లు కూడా కనిపిస్తున్నాయి. దీపావళికి పర్ఫెక్ట్ పోస్టర్ లాగా ఉంది.

రాధిక-కుమారస్వామి.jpg

రాధికా కుమారస్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ‘ది షాడోస్ బిహైండ్ ది కర్మ’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కూడా నటించబోతున్నాడు. ఈ యాక్షన్ చిత్రంలో శ్రేయాస్ తల్పాడే, సునీల్, రావు రమేష్, ఆదిత్య మీనన్, దేవ్ రాజ్, వినయ ప్రసాద్, శ్రవణ్ వంటి పలువురు సౌత్ స్టార్స్ నటిస్తున్నారు. (పాన్ ఇండియా ఫిల్మ్ అజాగ్రత)

ఇది కూడా చదవండి:

========================

*******************************

*******************************

*******************************

నవీకరించబడిన తేదీ – 2023-11-13T01:32:30+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *