బెంగళూరు/బళ్లారి, (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో బెంగళూరు, బళ్లారిలో నివసిస్తున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రవాసాంధ్రులు సంబరాలు చేసుకున్నారు. యలహంకలో సోమవారం రాత్రి చేనేత సంఘం నాయకుడు చిన్నప్ప, ఏపీ ఖాదీ బోర్డు మాజీ డైరెక్టర్ పాపన్న ఆధ్వర్యంలో పటాకులు కాల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా చిన్నప్ప, పాపన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అరాచక విధానాలకు పాల్పడుతోందన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో ఇటీవల బెయిల్ పై వచ్చిన చంద్రబాబు బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడం హర్షణీయం. రాష్ట్ర పర్యటనలో ప్రజల అభిమానాన్ని, యువగళం పాదయాత్రకు వస్తున్న స్పందనను తట్టుకోలేక చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన అభిమానులు లోకేష్, నర్రె వెంకట శివచిన్నప్ప, రాజశేఖర్, నాగిరెడ్డి, ఓడీసీ బాబా, రమణారెడ్డి, అప్పిరెడ్డి, కిషోర్, మీసాల్ రెడ్డి, సుధాకరరెడ్డి, రామేశ్వర రెడ్డి, అశోక్, రవీంద్ర, శివ, ఉతప్ప తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుకు బెయిల్ రావడంతో బళ్లారిలోని విద్యానగర్‌లోని అమూల్ నివాస్ వద్ద ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కమ్మసంఘం నాయకులు గుర్రం లాల్ మోహన్, ధర్మవరపు చిన్నప్పయ్య, కుడితిని శ్రీనివాసులు, బాలాజీ ల్యాబ్ రాయంకి రామానాయుడు, ఈశ్వరయ్య, హరిబాబు, కల్లపాడు విజయకుమార్, భాస్కర్, జగదీష్, లక్ష్మీనారాయణ, గుర్రం మోహన్ దాస్, గురుప్రసాద్, కోనంకి రవి, ప్రకాష్, చింబిలి ప్రకాష్, ము. తాళ్లూరు రమణ, వెంకటేశులు, బాబు, నాని, లత్తవరం మల్లికార్జున, శివలింగప్ప తదితర ప్రవాసాంధ్రులు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కమ్మ సంఘం నాయకులు గుర్రం లాల్ మోహన్ మాట్లాడుతూ రాజకీయ కుట్రతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. సీఎం జగన్ రెడ్డి అరాచక, దుర్మార్గపు, అవినీతి, కక్షపూరిత పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-11-21T11:23:43+05:30 IST