ఏపీ ప్రభుత్వం : విశాఖపట్నంలో మంత్రులు, అధికారుల శిబిరం

చివరిగా నవీకరించబడింది:

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి.

ఏపీ ప్రభుత్వం: విశాఖలో మంత్రులు, అధికారులకు క్యాంపు కార్యాలయాల కేటాయింపు.

ఏపీ ప్రభుత్వం: తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలో తాజాగా గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖపట్నంలో రాష్ట్ర మంత్రులు, అధికారులకు క్యాంపు కార్యాలయాలను గుర్తించారు.

విశాఖలోని రుషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాలను కమిటీ గుర్తించింది. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సందర్భంగా భవనాల వినియోగంపై కమిటీ (ఆర్థిక శాఖ కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం) నివేదిక ఆధారంగా సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మిలీనియం టవర్లలో A మరియు B టవర్లు కేటాయించబడ్డాయి. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సమయంలో వీటిని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

శాఖల సొంత భవనాలు, స్థలాలను మొదటి ప్రాధాన్యతగా వినియోగించుకోవాలని తెలిపారు. ఇంకా వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలీనియం టవర్లను వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 2 లక్షల 27 వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవన స్థలాలను గుర్తించారు. మిలీనియం టవర్స్‌లో లక్షా 75 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను గుర్తించారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో ఏపీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మరి దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.


ఇది కూడా చదవండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *