మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ లో నవంబర్ 17న ఎన్నికలు ముగియగా.. గతంతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2018లో 75.63% పోలింగ్ నమోదైంది. 2023లో 77.15% పోలింగ్ నమోదైంది.

మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ లో నవంబర్ 17న ఎన్నికలు ముగియగా.. గతంతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2018లో 75.63% పోలింగ్ నమోదైంది. 2023లో 77.15% పోలింగ్ నమోదైంది. నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎగ్జిట్ పోల్ ఎన్నికల సర్వే లాంటిది. ఓటింగ్ రోజున ఈ సర్వేను వివిధ కంపెనీలు నిర్వహిస్తాయి. కంపెనీ బృందాలు వివిధ నియోజకవర్గాలకు వెళ్లి ఓటు వేసిన తర్వాత ఎవరికి ఓటు వేశారని అడుగుతారు. ఈ డేటాను సేకరించిన తర్వాత, ఒక పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో అంచనా వేయబడుతుంది. ఫలితంగా ఏయే రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో అంచనా వేయవచ్చు.
కాగా, 2003 నుంచి మధ్యప్రదేశ్‌లో 2018 ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటి వరకు అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. అయితే.. 2020 మార్చిలో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి.. రాష్ట్రంలో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఈసారి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? ఇది చాలా ఆసక్తిని కలిగిస్తుంది. ఈ ఎన్నికల్లోనూ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బీజేపీ చెబుతుండగా, మధ్యప్రదేశ్‌లో ఈసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ గట్టిగా వాదిస్తోంది. మరి.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
బీజేపీ: 118-130
కాంగ్రెస్: 97-107
ఇతర: 0-2
కాంగ్రెస్: 111-121
బీజేపీ: 106-116
ఇతరులు: 0-6
నవీకరించబడిన తేదీ – 2023-11-30T17:53:10+05:30 IST