అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో భాగమని కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. శర్మ తన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగం కాదు.

డిస్పూర్: అస్సాం ముఖ్యమంత్రి హిమతా బిస్వా శర్మ, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అస్సాం ఒకప్పుడు మయన్మార్ (మయనార్)లో భాగమని కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. శర్మ తన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగం కాదని, చారిత్రక వాస్తవాలను ప్రస్తావిస్తూ తగిన పరిజ్ఞానం లేకుండా మాట్లాడకూడదని హితవు చెప్పారు.
పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ 6ఏ చట్టబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా కపిల్ సిబల్ తాజా వ్యాఖ్యలు చేశారు. 1824లో ఈ భూభాగాన్ని బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకున్నారని, ఒడంబడిక ద్వారా అస్సాంను బ్రిటిష్ వారికి అప్పగించారని చెబుతారు. తరువాత జరిగిన బెంగాల్ విభజనకు ముందు, ఈ భూభాగం తూర్పు బెంగాల్ (బంగ్లాదేశ్) ప్రాంతంతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారుల ప్రవేశాన్ని పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఏ ద్వారా చట్టబద్ధం చేశామని వివరించారు. ప్రజల వలసలు, జనాభా గురించి చరిత్ర ఉందని, అయితే వారు ఎక్కడి నుండి వలస వచ్చారో మ్యాప్ చేయలేదన్నారు. అస్సాం చరిత్రను పరిశీలిస్తే ఎవరు ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చారో తేల్చలేమని కపిల్ సిబల్ తన వాదన వినిపించారు.
జ్ఞానం లేకుండా మాట్లాడొద్దు: హిమంత్ బిస్వా శర్మ
కపిల్ సిబల్ వ్యాఖ్యలపై హిమంత్ బిస్వా శర్మ మండిపడ్డారు. “మీకు తెలియకపోతే మీరు మాట్లాడకూడదు. అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగం కాదు. అక్కడ కొద్దిసేపు గొడవ జరిగింది. ఒకే ఒక సంబంధం ఉంది. “అస్సాం మయన్మార్‌లో భాగమని డేటాను నేను ఎప్పుడూ చూడలేదు,” అని అతను చెప్పాడు. చారిత్రక సంక్లిష్టతలను గుర్తుంచుకోవాలని, అస్సాం మయన్మార్‌లో భాగమనే వాదనకు చారిత్రక రికార్డులు మద్దతు ఇవ్వవని, సున్నితమైన చారిత్రక అంశాలను, ముఖ్యంగా ప్రాంతీయ చరిత్రలను చర్చించేటప్పుడు ఖచ్చితత్వంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
నవీకరించబడిన తేదీ – 2023-12-09T15:07:28+05:30 IST