నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తాండల్’. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఓ మత్స్యకారుని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తాండల్’. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఓ మత్స్యకారుని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గత ఏడాదిన్నరగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాం.. ఈ సినిమా మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.. కొత్త అనుభూతిని కలిగించేందుకు దర్శకుడు చందు, నటుడు నాగ చైతన్య అండ్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. హిట్ వస్తే అవకాశాలు వస్తాయి.అవన్నీ వదులుకుని మొదటి కమిట్‌మెంట్ కోసం నిలబడే వారు చాలా తక్కువ. ‘కార్తికేయ 2′ తర్వాత చాలా అవకాశాలు వచ్చినా మా సంస్థలోనే చేసేందుకు కమిట్‌గా ఉన్నారు.’తాండల్’ టైటిల్ పెట్టినప్పటి నుంచి. అని అనౌన్స్ చేశారు, దాని అర్థం తెలుసుకునేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు.అలాగే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. ఆ సందేహాలను కొన్నాళ్లు అలాగే ఉంచుకోండి.. అన్నింటికీ మా సినిమాతో సమాధానం చెబుతాం’’ అని అల్లు అరవింద్ అన్నారు.
అనంతరం నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన 100% లవ్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ బ్యానర్‌లో ‘తాండల్’ సినిమా చేయడం ఆనందంగా ఉంది.
ఇది. ‘లవ్‌స్టోరీ’ తర్వాత మరోసారి సాయి పల్లవితో కలిసి నటించడం ఆనందంగా ఉంది.
నవీకరించబడిన తేదీ – 2023-12-10T15:05:09+05:30 IST