పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన: 14 మంది ఎంపీల సస్పెన్షన్.. కారణం ఇదే!

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన: 14 మంది ఎంపీల సస్పెన్షన్.. కారణం ఇదే!

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన: పార్లమెంట్‌లో 14 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. అనుచితంగా ప్రవర్తించినందుకు వారిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేశారు. తొలుత ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేయగా, మరో 9 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 9 మంది, సీపీఎం నుంచి ఇద్దరు, డీఎంకే నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు ఉన్నారు. స్పీకర్ ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించినందున వారిపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

మొదట ప్రతాపన్, హిబీ ఈడెన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్‌లను సస్పెండ్ చేశారు. స్పీకర్ ఆదేశాలను ఉల్లంఘించిన ఈ ఐదుగురు వ్యక్తుల తీరును తీవ్రంగా పరిగణిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత సభ 3 గంటలకు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే.. విపక్ష సభ్యులు మళ్లీ ఆందోళనకు దిగారు. దీంతో… బెన్నీ బెహనాన్, వీకే శ్రీకందన్, మహమ్మద్ జావేద్, పీఆర్ నటరాజన్, కనిమొళి, కె. సుబ్రహ్మణ్యం, ఎస్‌ఆర్ పార్థిబన్, ఎస్ వెంకటేశన్, మాణికం ఠాగూర్‌లను సస్పెండ్ చేస్తూ ప్రహ్లాద్ జోషి మరోసారి తీర్మానం చేశారు.

‘‘లోక్‌సభలో భద్రతపై స్పీకర్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సూచనలు అడిగారు. ఈ అంశంపై రాజకీయాలు చేయొద్దని సభలోనే విపక్షాలకు చెప్పారు. కానీ.. భద్రత కరువయ్యిందని ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. పార్లమెంటులో.. ఈ అంశంపై అమిత్ షా మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు.దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఓ. బ్రియాన్‌ను రాజ్యసభలో కూడా సస్పెండ్ చేశారు.లోక్‌సభలో భద్రతా లోపంపై చర్చకు పట్టుబట్టడంతో ఆయనను సస్పెండ్ చేశారు.

అయితే.. ఓబ్రెయిన్‌ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఎంపీ డోలాసేన్ తప్పుబట్టారు. పార్లమెంటుకు భద్రత లేకపోవడం దేశ భద్రతకు సంబంధించిన అంశమని ఆయన అన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తడం ప్రతిపక్షంగా వారి కర్తవ్యం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారికి ఈ అంశాన్ని లేవనెత్తే హక్కు ఉందని.. అందుకే వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. తమను సస్పెండ్ చేసినా సిద్ధంగా ఉన్నామన్నారు.

నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 14, 2023 | 05:19 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *