జెర్సీ నంబర్ 7: క్రికెట్ ప్రపంచంలో సచిన్‌కు ఎంత ఫేమస్మో ధోనీ. సచిన్ టన్నుల కొద్దీ పరుగులు చేసి భారత్ ప్రతిష్టను పెంచగా.. ధోనీ రెండు ప్రపంచకప్‌లు అందించి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. దీంతో సచిన్ జెర్సీ నంబర్ 10కి రిటైర్మెంట్ ఇచ్చినట్లే ధోనీ జెర్సీ నంబర్ 7ను కూడా రిటైర్మెంట్ చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐకి సూచించారు.

క్రికెట్ ప్రపంచంలో సచిన్‌కు ఎంత పేరు ఉందో ధోనీ కూడా అంతే పేరు తెచ్చుకున్నాడు. సచిన్ టన్నుల కొద్దీ పరుగులు చేసి భారత్ ప్రతిష్టను పెంచగా.. ధోనీ రెండు ప్రపంచకప్‌లు అందించి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. దీంతో సచిన్ జెర్సీ నంబర్ 10కి రిటైర్మెంట్ ఇచ్చినట్లే ధోనీ జెర్సీ నంబర్ 7ను కూడా రిటైర్మెంట్ చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐకి సూచించారు. ధోనీ అభిమానుల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ధోనీ జెర్సీ నంబర్ 7ను రిటైర్మెంట్ చేస్తున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ధోని సేవలకు గుర్తింపుగా టీమిండియా ఈ అరుదైన గౌరవాన్ని అందజేస్తోంది.
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో రనౌట్ అయిన ధోని ఆ క్షణంలో ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. అయితే, అతను ఆగస్టు 15, 2020న తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు కానీ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఈ ఏడాది మెగా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపి ధోని మరోసారి తన కెప్టెన్సీలోని సత్తా చాటాడు. ఇప్పుడు బీసీసీఐ అరుదైన గౌరవం దక్కడంతో ధోనీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 15, 2023 | 04:45 PM