సీఎం సిద్ధరామయ్య: కరువు నిధుల కోసం ప్రైవేట్ జెట్ ప్రయాణమా? సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ ఫైర్

సిద్ధరామయ్య

సీఎం సిద్ధరామయ్య: కేంద్రం నుంచి కరువు నిధులు అడిగేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఢిల్లీకి ‘ప్రైవేట్ జెట్’ వెళ్లడం బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆసక్తికర మాటల యుద్ధానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ షేర్ చేశారు.

కేంద్రం నుంచి కరువు నిధులు అడిగేందుకే సిద్ధరామయ్యతో కలిసి ‘ప్రైవేట్ జెట్’లో ఢిల్లీకి వచ్చానని అహ్మద్ ఖాన్ స్వయంగా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇదే వీడియోను షేర్ చేసిన అమిత్ మాలవీయ కర్ణాటక కాంగ్రెస్ యూనిట్‌పై దుమ్మెత్తిపోశారు. ఒకవైపు కాంగ్రెస్ ‘క్రౌడ్ పుల్లింగ్’ పేరుతో విరాళాలు సేకరిస్తూ.. ఇండియా అలయన్స్ మీటింగ్‌లో సమోసాలు కూడా వడ్డించలేని పరిస్థితుల్లో ఉన్నామని చెబుతూనే మరోవైపు సీఎం సిద్ధరామయ్య ఆనంద క్షణాలను పంచుకుంటున్నారు. సంతోషకరమైన క్షణాల పేరుతో ఒక ప్రైవేట్ జెట్. కర్ణాటకలో పాలన గాడి తప్పిందని, కాంగ్రెస్ దోపిడీ కొనసాగుతోందని విమర్శించారు.

నరేంద్ర మోదీ సంగతేంటి?..(సీఎం సిద్ధరామయ్య)

లగ్జరీ జెట్‌పై బీజేపీ చేసిన వ్యాఖ్యలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. “నరేంద్ర మోదీ ఎలా ప్రయాణిస్తారో.. ముందు అది చెప్పండి.. నరేంద్ర మోడీ ఏ విమానంలో ప్రయాణిస్తారో ముందుగా బీజేపీ వాళ్లు కనుక్కోండి.. ఆయన ఒంటరిగా ప్రయాణిస్తారు.. మీరెందుకు అలా ప్రయాణిస్తారు.. బీజేపీ మాట్లాడేవన్నీ చాలా సిల్లీగా ఉన్నాయి” అని సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా బీజేపీ విమర్శలను తోసిపుచ్చారు. తన స్వంత కారణాల వల్ల ప్రత్యేక విమానంలో వెళ్లలేదని, సమయం ఆదా చేసుకునేందుకే అందులో ప్రయాణించానని ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు. విమాన టిక్కెట్లు దొరకనప్పుడు ప్రైవేట్‌ విమానాల్లో వెళతామని, పార్టీ బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని డీకే తెలిపారు.

పోస్ట్ సీఎం సిద్ధరామయ్య: కరువు నిధుల కోసం ప్రైవేట్ జెట్ ప్రయాణమా? సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ ఫైర్ మొదట కనిపించింది ప్రైమ్9.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *