‘2.0, పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాలను నిర్మించి అందరి ప్రశంసలు అందుకున్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఇప్పుడు ‘ఇండియన్ 2, రజనీకాంత్ 170’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా విభిన్నమైన కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రేక్షకులకు అందించాలని లైకా సంస్థ ప్రయత్నిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నుండి వస్తున్న మరో డిఫరెంట్ మూవీ ‘మిషన్ చాప్టర్ 1’.
అరుణ్ విజయ్, అమీ జాక్సన్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అభి హాసన్, భరత్ బోపన్న, బేబీ ఇయాల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మాతలు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేవలం 70 రోజుల్లోనే లండన్, చెన్నై సహా పలు లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం గొప్ప విషయం. (మిషన్ చాప్టర్ 1 విడుదల వివరాలు)
‘2.0’లో నటించిన అమీ జాక్సన్ ‘మిషన్ చాప్టర్ 1’తో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఆమె జైలర్ పాత్రలో మెప్పించబోతోంది. ఈ సినిమాలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటి నిమిషా సజయన్ కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీత దర్శకుడు. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల కానుంది.
ఇది కూడా చదవండి:
====================
*సుహాసిని: ప్రస్తుత సినిమాలపై సుహాసిని హాట్ కామెంట్స్
*************************************
*బోండా మణి: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూశారు
*******************************
*సాలార్: రికార్డ్ బ్రేక్ బస్టర్.. రెండో రోజు ‘వరదే’ కలెక్షన్స్!
*************************************
*శ్రీయా రెడ్డి: ‘ఓజీ’లో పవన్ నటన గురించి అందరూ ఏమంటున్నారు?
*************************************
నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 25, 2023 | 12:01 AM