ఈ మ్యాచ్‌లో బుమ్రా ఎనిమిది వికెట్లు తీశాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు సాధించాడు.
జస్ప్రీత్ బుమ్రా రికార్డులు: కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంలో భారత పేస్ మ్యాన్ జస్ప్రీత్ బుమ్రా తనవంతు పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు సాధించాడు.
కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ మైదానంలో బుమ్రా 17 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు శ్రీనాథ్ పేరిట ఉండేది.
కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే.
జస్ప్రీత్ బుమ్రా – 17* వికెట్లు
జావగల్ శ్రీనాథ్ – 12 వికెట్లు
అనిల్ కుంబ్లే – 12 వికెట్లు
విరాట్ కోహ్లీ : దక్షిణాఫ్రికాపై చారిత్రాత్మక విజయం.. విరాట్ కోహ్లీ ‘భాంగ్రా’.. వీడియో వైరల్
కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షేన్ వార్న్‌తో కలిసి బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. నేటి మ్యాచ్‌తో సహా ఈ మైదానంలో బుమ్రా మూడు టెస్టులు ఆడాడు. 17 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ ఆటగాడు కొలిన్ బ్లైత్ 25 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే.
కోలిన్ బ్లైత్ (ఇంగ్లండ్) – 25 వికెట్లు
జస్ప్రీత్ బుమ్రా (భారతదేశం) – 17* వికెట్లు
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 17 వికెట్లు
జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) – 16 వికెట్లు
టీమిండియా బౌలర్లలో దక్షిణాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 45 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
దక్షిణాఫ్రికాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే.
అనిల్ కుంబ్లే – 45 వికెట్లు
జావగల్ శ్రీనాథ్ – 43 వికెట్లు
జస్ప్రీత్ బుమ్రా – 38* వికెట్లు
మహ్మద్ షమీ – 35 వికెట్లు
జహీర్ ఖాన్ -30 వికెట్లు
కేప్ టౌన్లో విజిటింగ్ బౌలర్ల ద్వారా అత్యధిక టెస్ట్ వికెట్లు..
25 – కోలిన్ బ్లైత్ (Eng) (1906-1910) 4 టెస్టుల్లో (SR 43)
17*- జస్ప్రీత్ బుమ్రా (భారతదేశం) (2018-2024*) 3 టెస్టుల్లో (SR 16)
17 – షేన్ వార్న్ (ఆస్) (1994-2006) 3 టెస్టుల్లో (SR 72)#IndvsSA #SAvInd#క్రికెట్ ట్విట్టర్— మోహన్‌దాస్ మీనన్ (@mohanstatsman) జనవరి 4, 2024